E-Paper
Advertisement

Flipkartలో రచ్చ లేపుతున్న Lava కొత్త ఫోన్లు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు బ్రో!

Flipkartలో రచ్చ లేపుతున్న Lava కొత్త ఫోన్లు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు బ్రో!
Advertisement

Lava Virat V1 5G: బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి దేశీయ బ్రాండ్ లావా మంచి వార్త చెప్పింది. ఇటీవల లాంచ్ చేసిన Virat V1 5G, Virat V1 ఫోన్లను భారత మార్కెట్‌లో అధికారికంగా అమ్మకానికి ఉంచింది. లాంచ్ ఆఫర్ కింద వీటికి ప్రత్యేక తగ్గింపులను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్లు లావా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ఆఫర్ల విషయానికి వస్తే.. లావా విరాట్ V1 5G 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఇది ఆర్య బ్లూ, సోనార్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. ఇక సాధారణ Virat V1 మోడల్ రూ.8,999లకే అందుబాటులో ఉంది. ఇది నీలగిరి బ్లూ, హిమాలయన్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. రోజూవారీ వాడకానికి, విద్యార్థులకు, మొదటిసారి స్మార్ట్‌ఫోన్ తీసుకునే వారికి ఇవి సరైన ఎంపికగా నిలుస్తాయి.

Advertisement

Also Read: WhatsApp యూజర్లకు బిగ్ రిలీఫ్.. స్టేటస్ క్యాప్షన్‌లో తప్పు పడిందా? ఇక డిలీట్ చేయక్కర్లేదు!

రెండు ఫోన్లలోనూ 6.75 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. అయితే 5G మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న యూనిసోక్ T8200 ప్రొసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్ వేగంగా పనిచేయడానికి దోహదపడతాయి. ఇక Virat V1 మోడల్ 90Hz రిఫ్రెష్ రేట్, యూనిసోక్ SC9863A ప్రొసెసర్‌తో ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌పై నడుస్తుంది. రెండింటిలోనూ 4GB వర్చువల్ ర్యామ్, మెమరీ కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకునే సౌకర్యం ఉంది.

Advertisement

ఫొటోగ్రఫీ కోసం రెండు మోడళ్లలోనూ 13MP వెనుక కెమెరా, సెల్ఫీల కోసం 5MP ముందు కెమెరా ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే.. 5G వేరియంట్‌లో 6000mAh భారీ బ్యాటరీని అందించగా, సాధారణ మోడల్‌లో 5000mAh బ్యాటరీని ఇచ్చారు. ఇవి రెండూ 10W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా, నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం వీటికి IP64 రేటింగ్ కూడా ఉండటం విశేషం.

Also Read: ఆండ్రాయిడ్ 16తో వచ్చిన మొదటి మాస్ టాబ్లెట్ ఇదే.. Moto Pad 70 Groove ధర ఎంతంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×