E-Paper
Advertisement

Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక
Advertisement

Amaravati: ఏపీలో కూటమి సర్కార్‌పై మరోసారి మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఇంధన కొరతతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు సర్కార్‌ను గుణపాఠం తప్పదన్న వైఎస్ షర్మిల

Advertisement

ఏపీ చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తారు కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నాలుగైదు రోజులుగా ఇంధన కొరత ప్రజలను వెంటాడుతోంది. ఫలితంగా వాహనదారులు, రైతులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా అవసరాలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, కేవలం అమరావతి కాంట్రాక్టర్ల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

కాంట్రాక్టర్ల కోసం ప్రత్యేకంగా డీజిల్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరడం వెనుక ప్రభుత్వ వైఖరి అర్థమవుతోందన్నారు. రైతు కన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా ఆమె పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులను ప్రాధాన్యం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

ప్రజల కంటే అమరావతి పనులకే ప్రాధాన్యత,  గుణపాఠం తప్పదని హెచ్చరిక

ఇది పాలన కాదని, ప్రాధాన్యతల వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, సాధారణ ప్రజలకు నిరంతర ఇంధనం అందేలా చూడాలన్నారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ల గురించి మాట్లాడాలన్నారు. ప్రజలు ఎలా పోతే ఏంటి మాకేంటి అనుకుంటే, ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన డీజిల్‌ను రిటైల్ ధరలకు సరఫరా చేయాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిన విషయం తెల్సిందే. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఏపీ పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాలు పెట్రోలియం రూల్స్, ఇతర నిబంధనలకు అనుగుణంగా లేవని కేంద్ర పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్ పేర్కొన్నారు.

ALSO READ: ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 599 మార్కులు సాధించిన విశాఖ విద్యార్థి!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×