E-Paper
Advertisement

3D కూలింగ్‌తో వచ్చేసిన.. అత్యాధునిక కదిలే ఏసీ.. వామ్మో ఇది మాముల్గా లేదుగా!

3D కూలింగ్‌తో వచ్చేసిన.. అత్యాధునిక కదిలే ఏసీ.. వామ్మో ఇది మాముల్గా లేదుగా!
Advertisement

New Portable AC: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ డ్రీమ్ (Dreame).. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సరికొత్త స్మార్ట్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ ను లాంచ్ చేసింది. ‘డ్రీమ్ పీ-విండ్ 10’ (Dreame P-Wind10) పేరుతో ఐరోపా మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోర్బబుల్ ఏసీ ఫీచర్లు.. వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అతి త్వరలోనే భారత్ లోనూ ఇది అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఈ నయా ఏసీకి సంబంధించిన ప్రధాన ఫీచర్లు, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

3D స్టైల్లో కూలింగ్..

‘డ్రీమ్ పీ-విండ్ 10’ పోర్టబుల్ ఏసీలో 3D స్టైల్ గాలి ప్రవాహాన్ని అందించారు. ఇది మిగతావాటితో పోలిస్తే వేగంగా గదిని చల్లబరుస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు దీనిని 3 ఇన్ 1 ఫంక్షన్ తో పనిచేసే విధంగా రూపొందించారు. ఇది కూలింగ్ ఇవ్వడం మాత్రమే కాకుండా గదిలోని తేమను తగ్గించడం (డీహ్యూమిడిఫైయర్), ఫ్యాన్‌గా పనిచేయడం వంటివి చేస్తుంది. మెుత్తం రెండు వేరియంట్లలో ఈ పోర్టబుల్ ఏసీ అందుబాటులోకి వచ్చింది. 7,000 BTU, 9,000 BTU సామర్థ్యంతో ఇది లభించనుంది.

స్మార్ట్ కంట్రోలింగ్

Advertisement

ఈ కదిలే ఏసీని.. వై-ఫై, రిమోట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో తీసుకొచ్చారు. అంతేకాకుండా డ్రీమ్ యాప్ ను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఈ పోర్టబుల్ ఏసీని కంట్రోల్ చేయెుచ్చు. రాత్రిళ్లు పడుకునే ముందు టైమర్ సెట్ చేయడం, స్లీప్ మోడ్ కి మార్చడం వంటివి ఈ యాప్ ను ఉపయోగించి సులభంగా చేయవచ్చు.

ఈజీగా తరలించవచ్చు

‘డ్రీమ్ పీ-విండ్ 10’ పోర్టబుల్ ఏసీని ఒక గది నుంచి మరో గదికి తేలిగ్గా తరలించవచ్చు. తద్వారా ఇంట్లోని ప్రతీమూలను కూలింగ్ తో నింపేయవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు వీలుగా అడుగు భాగంలో చక్రాలను అమర్చారు. దీని సైజ్ కూడా చిన్నదే కావడం వల్ల.. తేలిగ్గా ఇంట్లోని గదుల్లోకి మార్చుకోవచ్చు. అంతేకాకుండా దీనికి అమర్చిన ఎల్ఈడీ స్క్రీన్ ను ఉపయోగించి.. నచ్చిన మోడ్స్ లో కూలింగ్ ను సెట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: BSNL FTTH: సరికొత్త పల్లె విఫ్లవం.. ఏకంగా 79 వేల గ్రామాల్లో.. ఇంటర్నెట్ సేవలు ప్రారంభం!

ఇంతకీ ధర ఎంతంటే?

ప్రస్తుతానికి ఈ మోడల్ ఐరోపా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. డ్రీమ్ కంపెనీ ఈ పోర్టబుల్ ఏసీ ధరను వేరియంట్ల ఆధారంగా నిర్ణయించింది. 7,000 BTU ధర సుమారు 359 యూరోలు. అంటే భారత కరెన్సీ ప్రకారం ఇది రూ.32,000కు సమానం. మరోవైపు 9,000 BTU ప్రీమియం మోడల్ ను 399 యూరోలకు (సుమారు రూ.35,000) విక్రయిస్తోంది. అయితే భారత్ లో ఈ పోర్టబుల్ ఏసీని ఎప్పుడు లాంచ్ చేస్తారన్న దానిపై డ్రీమ్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: జియో ఆర్థిక లెక్కలు విడుదల.. కస్టమర్ల సంఖ్య, డేటా వినియోగం, సగటు ఆదాయం.. చూస్తే మతిపోవాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×