E-Paper
Advertisement

JAGAN : అమరావతిపై వెనక్కి తగ్గిన జగన్?.. అందుకోసమేనా?

JAGAN : అమరావతిపై వెనక్కి తగ్గిన జగన్?.. అందుకోసమేనా?
Advertisement

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ఏపీ రాజధాని బిల్లును నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.దానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీలు సైతం మద్దతు పలకగా.. వైసీపీ మాత్రం మద్దతు ప్రకటించలేదు. స్పీకర్ ఓం బిర్లా అమరావతి బిల్లుపై చర్చ కోసం సమయాన్ని కేటాయించారు. చర్చ సందర్భంగా ఏపీ ప్రజల భవిష్యత్ కోసం రూపుదిద్దుకుంటున్న రాజధానికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నేతలు కనీస ఆలోచన చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

లోకసభలో ఆమోదం..

చర్చ అనంతరం లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం లభించింది. ఈ విషయాన్ని స్పీకర్ ప్రకటించగానే వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర రాజధానికి చట్టబద్దత కోసం కూటమి సర్కార్ కేంద్రాన్ని ఒప్పించి మరి ఇంత చేస్తుంటే.. ఏపీ ప్రతిపక్ష నేతగా జగన్ మద్దతు పలకాల్సిపోగా, వ్యతిరేకించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు అమరావతిని రాజధానిగా చేయడం ఇష్టం లేదని, అందుకే వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచాయి. ఇంకా ఏపీకి రాజధాని లేకపోవడం పాలకుల తప్పేనని నెట్టింట జరుగుతోంది. తొలి టర్ములో చంద్రబాబు రాజధాని నిర్మాణం చేపట్టగా.. అంతలోనే ప్రభుత్వం మారింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల పేరిట కాలయాపన చేశారు.

జగన్ తలుచుకుంటే…

Advertisement

గత ప్రభుత్వంలో జగన్ తలుచుకుంటే ఏపీ రాజధాని ఇప్పటికే పూర్తయ్యేది. రాజకీయాల్లో ప్రభుత్వాలు మారడం కామన్. చంద్రబాబు సర్కారు వెళ్లగానే వచ్చిన వైసీపీ సర్కారు.. అమరావతి రాజధానిపై ఫోకస్ చేసి ఉంటే ఇప్పటికే పూర్తయ్యేది. ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరికేవి. కేవలం చంద్రబాబుకు క్రెడిట్ దక్కకుండా చేసేందుకు జగన్ రాజధానిని మార్చారని.. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని కూడా చర్చ జరుగుతున్నది. సాధారణంగా గత ప్రభుత్వం సగం పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వాలు పూర్తి చేస్తుంటాయి. మరి జగన్ ఎలా ఎందుకు చేయలేకపోయారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు మీద కోపంతోనే ఇలా చేశారని మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు.. రూ.44,000 కోట్ల ఆదాయంతో చరిత్ర సృష్టి!

Advertisement

దీంతో రాష్ట్రం పదేండ్లు వెనక్కి వెళ్లిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.గత ఐదేండ్లలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కట్టేవి. ఎక్కడైతే ‘రెడీ టు సేల్’ సదుపాయాలు ఉంటాయో అక్కడి వచ్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతుంటాయి. ఆ విషయాన్ని జగన్ మరిచినట్టు ఉన్నారు. ఎలాగూ అమరావతి బిల్లుకు చట్టబద్ధత రాకుండా జగన్, వైసీపీ నేతలు ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో మనుగడ సాధించాలంటే అమరావతికి మద్దతు ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొంది. అందుకే జగన్ మనసు మార్చుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. మరల తాను అధికారంలోకి రావాలంటే ప్రజల ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఏపీ ప్రజలకు రాజధాని అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన జగన్.. చివరకు అమరావతికి జై కొట్టడమే కాకుండా పలు మార్పులు చేర్పులు సూచించి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×