E-Paper
Advertisement

కారు పెయింట్ కొత్తదానిలా మెరవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

కారు పెయింట్ కొత్తదానిలా మెరవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!
Advertisement

Car Paint Protection Guide: కారు అందంగా కనిపించడానికి పెయింట్ చాలా ముఖ్యమైనది. కేవలం మెరుపు కోసం మాత్రమే కాదు, కారు లోపల ఉన్న మెటల్ ను వేడి, వర్షం, దుమ్ము నుంచి కాపాడుతుంది. అయితే, మన దేశంలో వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటుంది. ఎక్కువ ఎండ, కాలుష్యం, దుమ్మునెమ్మదిగా కారు పెయింట్‌ ను డ్యామేజ్ చేస్తాయి. అందుకే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే,  కారు చాలా కాలం కొత్తదిలా మెరుస్తుంది.

కారు మెరిసేలా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలోకండి!

కారును క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి. దుమ్ము, మురికి కారు మీద ఉండిపోతే,  పెయింట్‌ మీద ఎఫెక్ట్ పడుతుంది. పక్షుల రెట్టలు, చెట్ల నుంచి పడే జిగురు లాంటి వాటిని వెంటనే తొలగించాలి. ఇవి కాలం అలాగే ఉంటే, శాశ్వతంగా మరకలు పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా వారానికి ఒకసారి లేదంటే రెండు వారాలకు ఒకసారి శుభ్రంగా కడిగితే సరిపోతుంది. రోజూ ఉపయోగించే కారు అయితే తరచుగా శుభ్రం చేయడం మంచిది.

సరైన షాంపోని వాడండి!

Advertisement

కారు కడిగేటప్పుడు సరైన షాంపోని ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలా మంది వాషింగ్ పౌడర్, డిష్ వాష్ లిక్విడ్ వాడుతారు. కానీ, అవి కాస్త గట్టిగా ఉండి పెయింట్‌ పై ఉన్న రక్షణ పొరను తొలగిస్తాయి. దీని వల్ల కారు మెరుపు తగ్గిపోతుంది. అందుకే ప్రత్యేకంగా కార్ల కోసం తయారు చేసిన షాంపోలనే వాడాలి.

ఇక కారును ఎప్పుడూ ఎండలో కడగకూడదు. ఎండలో నీరు త్వరగా ఆరిపోతుంది, దీంతో సబ్బు మరకలు పడతాయి.  ఉదయం  లేదంటే సాయంత్రం సమయంలో వాష్ చేయడం మంచిది. కారు తుడిచేటప్పుడు మైక్రోఫైబర్ గుడ్డను ఉపయోగిస్తే మంచిది. గట్టి గుడ్డలు చిన్న చిన్న గీతలు పడేందుకు కారణం అవుతాయి.

Advertisement

అటు పార్కింగ్ కూడా పెయింట్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది. కారును ఎప్పుడూ ఎండలో పార్క్ చేస్తే, కలర్ నెమ్మదిగా వెలిసిపోతుంది. అందుకే వీలైనంత వరకు నీడలో లేదంటే, బేస్‌ మెంట్‌ లో పార్క్ చేయడం మంచిది. అది సాధ్యం కాకపోతే, మంచి క్వాలిటీ కలిగిన కార్ కవర్ ను వాడటం మంచిది.

అదే సమయంలో దుమ్ము పట్టిన కారును పొడిగా తుడవకూడదు. దుమ్ము ఇసుకలా పని చేసి గీతలు అయ్యేందుకు కారణం అవుతుంది. అందుకే, ముందుగా నీటితో కడిగి, తరువాతే తుడవాలి. కారు పెయింట్‌ ను కాపాడుకోవడానికి వ్యాక్సింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇది రక్షణ పొరలా పనిచేస్తుంది. నీరు సులభంగా జారిపోతుంది కారు మరింత మెరుస్తుంది. ప్రతి కొన్ని నెలలకు ఒకసారి వాక్స్ వేయడం సరిపోతుంది. కొంతమంది సీలెంట్లు, సిరామిక్ కోటింగ్ లాంటిటి వాడుతారు. అయితే, వీటికి కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటుంది.  అయితే, ఎక్కువకాలం ప్రొటెక్షన్ అందిస్తాయి. చిన్నిజాగ్రత్తలు తీసుకుంటే మీ కారు చాలా కాలం కొత్తదిలా కనిపిస్తుంది.

Read Also: ఆలస్యం చేస్తే మిస్.. EV కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×