E-Paper
Advertisement

Visakhapatnam Cracker Blast: భారీ పేలుళ్లు.. విశాఖలో టెన్షన్ టెన్షన్

Visakhapatnam Cracker Blast: భారీ పేలుళ్లు.. విశాఖలో టెన్షన్ టెన్షన్
Advertisement

Visakhapatnam Cracker Blast: విశాఖపట్నం గోపాలపట్నంలోని చంద్రనగర్ ప్రాంతంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక నివాస గృహంలోని మూడవ అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచగా, తయారీ సమయంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు, ఇల్లు పూర్తిగా దెబ్బతిని స్లాబ్ పగిలిపోయింది. బాంబులు పేలుతూ ఆకాశంలోకి సారాజవ్వులు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.

ఈ ప్రమాదం జరిగిన సమయం ఆదివారం కావడంతో, చుట్టుపక్కల ఇళ్లలో నివసించే వారు బయటకు వెళ్లడం వల్ల ఒక పెద్ద ప్రాణాపాయం తప్పింది. అయితే, పేలుడు వల్ల వెలువడిన దట్టమైన పొగను పీల్చడం వల్ల కొందరు అస్వస్థతకు గురయ్యారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తిపై గతంలోనే బాణాసంచా తయారీకి సంబంధించి పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో అధికారులు దాడులు నిర్వహించి మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని తగలబెట్టినప్పటికీ, అతను పోలీసుల కళ్లు గప్పి రహస్యంగా వేరే గదిని అద్దెకు తీసుకుని ఈ ప్రమాదకరమైన పనిని కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×