E-Paper
Advertisement

Ban vs Pak ODI: పాకిస్తాన్ మ‌రో ఘోర ఓట‌మి, 11 ఏళ్ల త‌ర్వాత సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్‌

Ban vs Pak ODI: పాకిస్తాన్ మ‌రో ఘోర ఓట‌మి, 11 ఏళ్ల త‌ర్వాత సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్‌
Advertisement

Ban vs Pak ODI: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో చెత్త ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్, మరో ఘోర పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్, 11 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయింది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan)  మధ్య ఇవాళ చిట్ట చివరి వన్డే జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్, చివరి వరకు పోరాడింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై 11 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. దీంతో 2-1 తేడాతో పాకిస్తాన్ పై 11 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బ‌తుకురా, సంజుపై గిల్ కుట్ర‌లు..ఫోటో మార్ఫింగ్ చేసి మ‌రీ!

2-1 తేడాతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్‌

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ 3 వన్డేల సిరీస్ లో ఇవాళ చిట్టచివరి వన్డే జరిగింది. దాకా లోని షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడవ వన్డే ఇవాళ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి 290 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఐదు వికెట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. బంగ్లా ఓపెనర్ తంజీద్ హసన్ తమీమ్ 107 పరుగులతో అదరగొట్టాడు.

ఇక బంగ్లాదేశ్ విధించిన 291 పరుగులను ఛేదించే క్రమంలో పాకిస్తాన్ కూడా గట్టిగానే పోరాడింది. కానీ నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్తాన్ 279 పరుగులకే ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ టి20 కెప్టెన్ సల్మాన్ అఘా 106 పరుగులు చేసి అదరగొట్టాడు. కానీ చివరి క్షణంలో తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి, స‌ల్మాన్ అఘా ఔట్ కావడంతో బంగ్లా చేతిలోకి మ్యాచ్ వెళ్ళింది. అటు పాకిస్తాన్ వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రీది చివరలో 37 పరుగులతో పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో బంగ్లాదేశ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది పాకిస్తాన్. ఈ క్రమంలో 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకుంది బంగ్లాదేశ్.

11 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్

Advertisement

3 వన్డేల‌ సిరీస్ గెలుపుతో బంగ్లాదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. 11 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ పై వన్డే సిరీస్ గెలిచిన జట్టుగా బంగ్లాదేశ్ రికార్డు లోకి ఎక్కింది. 2015 ఏప్రిల్ లో బంగ్లాదేశ్ పర్యటనకు పాకిస్తాన్ వచ్చింది. అప్పుడు 3-0 తేడాతో వైట్ వాష్ అయింది పాకిస్తాన్. ఇక ఇప్పుడు మరోసారి వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ జ‌ట్టుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 11వ ర్యాంకింగ్ ఉన్న బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవ‌డంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: Sunrisers Hyderabad: SRHకు మ‌రో ఎదురుదెబ్బ‌..త‌ప్పుకున్న 12 స్పాన్స‌ర్లు, కోట్ల‌ల్లో కావ్య‌కు న‌ష్టం !

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×