E-Paper
Advertisement

విశాఖ మెట్రోకు మళ్లీ ఏమైంది? ఓ అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి, రైట్స్ కొర్రీలు

విశాఖ మెట్రోకు మళ్లీ ఏమైంది? ఓ అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి, రైట్స్ కొర్రీలు
Advertisement

Visakha Metro: విశాఖ సిటీ మెట్రో రైలు వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఓ అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కి వెళ్తోందా? రైట్స్ కన్సల్టెన్సీ నివేదిక‌తో కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడిందా? కేవలం గాజువాక నుంచి హనుమంతవాకకు పరిమితం చేసిందా? దీనిపై ఏపీ ప్రభుత్వం మాటేంటి? ఏ విధంగా అడుగులు వేయనుంది?

విశాఖ మెట్రో కారిడార్‌‌కు మళ్లీ గ్రహణం

Advertisement

విశాఖపట్నం సిటీ డబుల్‌ డెక్కర్‌ మెట్రో కారిడార్‌‌ ప్రతిపాదనలు కేంద్రం చేతికి చేరాయి. 20 కిలోమీటర్లు మేరా డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీనిపై సర్వే చేసిన రైట్స్ కన్సల్టెన్సీ సంస్థ తెరపైకి కొత్త సిఫార్సులు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం 20 కిలోమీటర్ల మేరా ప్రతిపాదనలు చేసింది. కానీ రైట్స్ కన్సల్టెన్సీ మాత్రం కేవలం 13 కిలోమీటర్లు చాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.

కేవలం ఈ కారిడార్ గాజువాక నుంచి హనుమంతవాక వరకు సరిపోతుందని సూచించినట్టు తెలుస్తోంది. విశాఖలో 140.13 కిలోమీటర్లు మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి దశలో 46.23 కిలోమీటర్లు రూ.11,498 కోట్లతో ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు చేసింది. నగరం మధ్యలోని నేషనల్ హైవే దగ్గర ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్ నిర్మిస్తామని ప్రస్తావించింది.

Advertisement

రైట్స్ కొర్రీలు.. కేంద్రం ఏమంటుందో?

లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు ప్లాన్ చేసింది. అదే సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు బదులు డబుల్ డెక్కర్ కారిడార్ ను తెరపైకి తెచ్చింది. 20 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ ను ప్రతిపాదించింది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌. డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను స్టీల్‌ప్లాంట్‌ నుంచి గాజువాక వరకు 5 కిలోమీటర్లు కాగా, తాటిచెట్లపాలెం నుంచి మధురవాడ వరకు 15 కిలోమీటర్లు ఉండాలని ప్లాన్ చేసింది.

దీనికి భూసేకరణ లేకుండా నేషనల్ హైవే మధ్యలో ఈ నిర్మించాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ విధంగా డిజైన్ చేసింది. రాష్ట్ర మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కేంద్రానికి ఈ ప్రతిపాదనలు, డీపీఆర్‌ను పంపింది. డబుల్‌ డెక్కర్‌ ప్రతిపాదనల్ని కుదించాలని రైట్స్‌ సంస్థ కేంద్రానికి సిఫార్సు చేయడంతో ఇంతకీ మెట్రో ప్రాజెక్టు అడుగు పడుతుందా లేదా అన్నదానిపై చర్చ మొదలైంది.

ALSO READ: ఏఎంబీ సినిమాస్‌లో నమ్రత, సితారలతో పాటు ప్రియాంక చోప్రా సందడి.. వైరల్ అవుతున్న పిక్స్..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×