E-Paper
Advertisement

Janasena Party: విజయవాడ జనసేన మీటింగ్‌లో రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న నేతలు.. మీడియాపై దాడి..!

Janasena Party: విజయవాడ జనసేన మీటింగ్‌లో రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న నేతలు.. మీడియాపై దాడి..!
Advertisement

Janasena Party: విజయవాడలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి సమక్షంలోనే సొంత పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడటం గమనార్హం.

విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ, పార్టీ నేత రావి సౌజన్య మాట్లాడుతూ.. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నా తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని రామ్ తాలూరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆమె మాట్లాడుతున్న సమయంలోనే ఇతర నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెపై ఎదురుదాడికి దిగారు. సౌజన్య పార్టీ ముసుగులో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనితో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై, తోపులాటకు దారితీసింది.

Advertisement

నేతల మధ్య గొడవను వీడియో తీస్తున్న బిగ్ టీవీ (Big TV) కెమెరామన్‌పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. కెమెరాను లాక్కొని, వీడియోలు తీయవద్దంటూ దుర్భాషలాడారు. తోటి మీడియా మిత్రులందరూ దీనిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే జోక్యం చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామాన్య ఉదయభాను, దాడికి పాల్పడిన నేతలతో మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన గైడ్ లైన్స్ జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, పార్టీలో తమకు తగిన గుర్తింపు లభించడం లేదని పలువురు కార్యకర్తలు ఈ సందర్భంగా నేతల ముందు మొరపెట్టుకున్నారు.

Advertisement

Read Also: Addanki Counter: వేడెక్కిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ వ్యాఖ్యలు, అసలు గుట్టు బయటపెట్టిన అద్దంకి

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×