E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: నేతాజీకి కవిత ఘన నివాళి.. అండమాన్ దీవుల పేరు మార్చాలని ప్రధానికి లేఖ

Kalvakuntla Kavitha: నేతాజీకి కవిత ఘన నివాళి.. అండమాన్ దీవుల పేరు మార్చాలని ప్రధానికి లేఖ
Advertisement

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఆమె, నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ పోషించిన వీరోచిత పాత్రను ఆమె స్మరించుకున్నారు.

అండమాన్ పేరు మార్చాలని డిమాండ్

అండమాన్ నికోబార్ దీవుల పేరును ‘ఆజాద్ హింద్’ దీవులుగా మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను లేఖ రాసినట్లు కవిత వెల్లడించారు. ఇది కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదని, దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులకు ఇచ్చే అసలైన గౌరవమని ఆమె పేర్కొన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వంటి నేతలు చేసిన పేరు మార్పుల రాజకీయాలతో దీనిని పోల్చకూడదని, ఇది కేవలం రాజకీయాల కోసం చేస్తున్న డిమాండ్ కాదని ఆమె స్పష్టం చేశారు.

నేతాజీ మేధస్సు – సంకల్ప సిద్ధి

Advertisement

నేతాజీ ఒక అసాధారణ మేధావి అని కొనియాడారు. ఐసీఎస్ (ICS) పరీక్షలో ఆయన 4వ ర్యాంక్ సాధించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. వైద్యం కోసం విదేశాలకు వెళ్లినప్పటికీ.. అక్కడ కూడా విశ్రమించకుండా దేశ విముక్తి కోసమే నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడని ఆమె ప్రశంసించారు. ‘లక్ష్య సిద్ధి, సంకల్ప సిద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు’ అని నేతాజీ నిరూపించారని, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

మహిళా శక్తికి ప్రాధాన్యత

ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ‘ఝాన్సీ రెజిమెంట్’ పేరుతో ప్రత్యేక మహిళా దళాన్ని ఏర్పాటు చేసిన నేతాజీ దార్శనికత అద్భుతమని కవిత అన్నారు. బ్రిటిష్ వ్యతిరేక దేశాలతో దౌత్యపరంగా స్నేహం చేసి, అంతర్జాతీయ మద్దతు కూడగట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఆయన పోరాటం అమోఘమని కొనియాడారు.

తెలంగాణ జాగృతికి AIFB మద్దతు

Advertisement

ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) నాయకత్వం కీలక ప్రకటన చేసింది. నేతాజీ ఆశయాల సాధనలో తెలంగాణ జాగృతి చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఇకనుంచి తమ పార్టీ పూర్తి మద్దతు తెలంగాణ జాగృతికి ఉంటుందని వారు ప్రకటించారు. ఈ సమన్వయం భవిష్యత్తులో సామాజిక, రాజకీయ మార్పులకు నాంది పలకనుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ALSO READ: Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు! 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×