E-Paper
Advertisement

Vijayawada: విజయవాడలో దారుణం: నర్సుగా పనిచేస్తున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Vijayawada: విజయవాడలో దారుణం: నర్సుగా పనిచేస్తున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Advertisement

Vijayawada: నగరంలో పట్టపగలే దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, మృతురాలు సరస్వతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఆమె ఆసుపత్రి నుంచి బయటకు రాగానే, అప్పటికే అక్కడ కాపుకాచిన భర్త విజయ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. భార్య పొట్టలో, మెడపై విచక్షణారహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.

Advertisement

గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భర్త కోపం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అక్కడే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సరస్వతి హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022 ఫిబ్రవరి 14న సరస్వతి, నిందితుడు విజయ్ ప్రేమ వివాహాం చేసుకున్నారు.  వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా సరస్వతి పని చేస్తుండగా.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా విజయ్ పని చేస్తున్నాడు. భార్య వేరే ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గత కొన్ని రోజులుగా విజయ్ అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ సరస్వతిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×