E-Paper
Advertisement

Happy Children’s Day 2025: పిల్లలకు ఆనందం, విజ్ఞానం అందించే గ్యాడ్జెట్స్ ఇవే.. చిల్డ్రన్స్ డే గిఫ్ట్‌గా ఇవి ఇస్తే సరి!

Happy Children’s Day 2025: పిల్లలకు ఆనందం, విజ్ఞానం అందించే గ్యాడ్జెట్స్ ఇవే.. చిల్డ్రన్స్ డే గిఫ్ట్‌గా ఇవి ఇస్తే సరి!
Advertisement

Children’s Day 2025: భారతదేశంలో ప్రతిఏటా నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని చిల్డ్రన్స్ డేని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ బాలల దినోత్సవానికి మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలనుకుంటుంటే.. వారికి ఉపయోగకరంగా ఉండేవాటిని ఎంచుకోవడం ఉత్తమం. ఈ ప్రత్యేకమైన గిఫ్ట్స్  పిల్లల అభివృద్ధికి తోడ్పడతాయి. అలాగే పిల్లలకు నచ్చిన వస్తువులను గిఫ్ట్స్‌గా ఇవ్వడం వల్ల వారికి చదువుతో పాటు ఆనందమూ వారి వెంటే ఉంటుంది.

ఎలాంటి బహుతులు ఇస్తున్నారు?

బాలల దినోత్సవం సందర్భంగా మీరిచ్చే కానుకలు.. పిల్లల అభివృద్ధికి తోడ్పాటును అందించేలా ఉండాలి. అంతేగానీ, మనమే చేతులారా పిల్లలను పాడుచేసేలా ఉండకూడదు. ఈ రోజుల్లో పిల్లలకు సాంకేతికత చాలా అవసరం కాబట్టి.. వారి చవువుకి మరింత జ్ఞానమూ డోడవ్వాలంటే కొన్ని కూల్ గ్యాడ్జెట్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం ఉత్తమం. అయితే, ఈ గాడ్జెట్‌లను కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోశాలి. ఇది వారి పెరుగుదల, అభివృద్ధికి చాలా ముఖ్యమైనదిగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడే కొన్ని గ్యాడ్జెట్‌లపై ఓ లుక్కుద్దాం..

డిజిటల్ కెమెరా:

Advertisement

ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఇష్టపడే పిల్లలకు డిజిటల్ కెమెరాలను బహుమతిగా ఇవ్వొచ్చు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక.. వారి బాల్యంలో జరిగిన జ్ఞాపకాలన్నీ ఇందులో పదిలమై ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా.. ఈ డిజిటల్ కెమెరాలను పిల్లల ప్రాజెక్టుల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

రోబోటిక్స్ టూల్‌బాక్స్:

చిల్డ్రన్స్ డే రోజున పిల్లలకు ఈ రోబోటిక్స్ టూల్‌బాక్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం వలన వారిలో ఆలోచన విధానం, సృజనాత్మకత పెరుగుతుంది. ఈ టూల్‌బాక్స్ రోబోట్ అప్తికేషన్ల రూపకల్పనకు అవసరమైన అల్గారిథమ్‌లను రూపొందించడానికి, పరీక్షించడానికి సాధనాలను అందిస్తుంది.

కిండిల్/ఎలక్ట్రానిక్ రీడింగ్ టాబ్లెట్:

Advertisement

ఈ కిండిల్ ఒక ఎలక్ట్రానిక్ రీడర్ పరికరం. ఇది ఈ-బుక్స్, మ్యాగజైన్, వార్తాపత్రికలు, పిల్లల స్టడీ బుక్స్ మొదలైనవి చదవడానికి వీలుగా రూపొందించబడింది. కిండిల్ పరికరాలతో పాటు, కిండిల్ అనే పేరుతో ఒక యాప్ కూడా ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో పుస్తకాలను చదవడానికి ఉపయోగపడుతుంది.

నింటెండో స్విచ్:

ఇదొక హైబ్రిడ్ గేమ్ కన్సోల్. ఈ పరికరం ఒకే సమయంలో అనేక మోడ్‌లలో పనిచేయగలదు. దీనిని టీవీకి కనెక్ట్ చేసి ఆడుకోవడం, చేతిలో పట్టుకుని ఆడుకోవడం, లేదా స్టాండ్‌ను ఉపయోగించి టేబుల్‌టాప్‌లో ఆడుకోవడం వంటివి చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ మీ పిల్లల ఆలోచన, సృజనాత్మకతను పెంచడంలో ఉపయోగపడుతుంది.

కోడింగ్ రోబోలు:

మీ పిల్లల్లో ప్రోగ్రామింగ్, రోబోటిక్స్ గురించి అవగాహనను పెంచాలనుకుంటే ఈ కోడింగ్ రోబోలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. కోడింగ్ రోబోలు అంటే.. ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా నిర్దేశించిన పనులను చేసే యంత్రాలు. C/C++, పైథాన్, జావా వంటి ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి రోబోటిక్స్‌లో ప్రాథమిక అంశాలను నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఈ కోడింగ్ రోబోలు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×