E-Paper
Advertisement

Vaikunta Ekadashi Tirumala Darshanam : వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఉన్నవారికే స్వామి దర్శనం..

Vaikunta Ekadashi Tirumala Darshanam : వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఉన్నవారికే స్వామి దర్శనం..
Advertisement

Vaikunta Ekadashi Tirumala Darshanam : వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులనే తిరుమలకు అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలో ‘డయల్‌ యువర్ ఈవో’ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ఈవో ప్రకటించారు. వైకుంఠ ద్వార దర్శనాల వేళ రోజుకు 25వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను జారీ చేస్తామన్నారు. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు.

తిరుమల స్థానికులకు కౌస్తుభం వద్ద టోకెన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాట్టు తెలిపారు.. మొత్తంగా 7.5 లక్షల మందికి సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.. 10 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు.. శ్రీవారి ట్రస్టు దాతలకు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తామన్నారు. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని ఈవో చెప్పారు. డిసెంబర్‌ 29 నుంచి జనవరి 3వ తేదీ వరకు తిరుమలలో అడ్వాన్స్‌ గదుల బుకింగ్‌ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సీఆర్‌వో వద్దనే భక్తులకు గదులు కేటాయించేలా అన్ని ఏర్పాటు చేస్తాం అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×