E-Paper
Advertisement

Car Accident: అతి వేగం.. ఏడు పల్టీలు కొట్టిన కారు, ఆ తర్వాత..

Car Accident: అతి వేగం.. ఏడు పల్టీలు కొట్టిన కారు, ఆ తర్వాత..
Advertisement

Car Accident: చిత్తూరు జిల్లో రోడ్లు రక్తమోడుతున్నాయి. శుక్రవారం ఘోరమైన ప్రమాదం జరగ్గా, తాజాగా శనివారం మరో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు-చెన్నై హైవే మీదుగా వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్ లో మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

శనివారం ఉదయం బెంగుళూరు నుంచి తిరుపతి ఏడుగురు సభ్యులతో కూడిన ఫ్యామిలీ తిరుపతికి వస్తోంది. హైవే రోడ్డు కావడంతో ఇన్నోవా కారు స్పీడ్‌గా వెళ్తోంది. అయితే చిత్తూరు జిల్లా బంగారుపాలెం సమీపంలోకి రాగానే కారు టైరు పేలిపోయింది. కారు స్పీడ్‌ను డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు.

Advertisement

కారు ఏడు పల్టీలు కొట్టింది. చివరకు బ్రిడ్జి పక్కనేవున్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం సమయంలో కారులో ఏడుగురు వున్నారు. వారంతా ఒకే ఫ్యామిలీకి చెందినవారుగా తెలుస్తోంది. సేఫ్టీ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ALSO READ: సీతారాం ఏచూరి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు.. సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తి

Advertisement

వేగానికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు. వీరంతా ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎటు వెళ్తున్నారు? అనేదానిపై సమాచారం సేకరిస్తున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×