E-Paper
Advertisement

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, అసలు కారణం అదే

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, అసలు కారణం అదే
Advertisement

Tirumala News: తిరుమలల్లో రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది. కనీసం ప్రతీ రోజు రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక వీకెండ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇక్కోసారి రికార్డు స్థాయిలో భక్తులు తిరుమలకు పొటెత్తుతున్నారు. తాజాగా రెండు రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక

Advertisement

ఏడాదికి ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని భక్తులు కోరుకుంటున్నారు. మరికొందరైతే జీవితంలో ఒక్కసారి శ్రీనివాసుడ్ని చూడాలని కలలుకంటారు. కానీ కొందరి మాత్రమే సాధ్యపడుతుంది. గతంలోకంటే తిరుమల కొండలపై భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. స్వామి దర్శనానికి వెళ్లినవారు కొందరైతే.. దర్శనం తర్వాత వచ్చేవారు మరికొందరు.

ప్రతి రోజు భక్తులతో తిరుమల గిరులు సందడిగా మారుతోంది. దర్శనాలకు టికెట్లు దొరక్క చాలామంది అక్కడే ఉంటున్నారు. మరికొందరు వీఐపీ లెటర్ పేరుతో దర్శనాలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. తాజాగా తిరుమలకు వచ్చే భక్తులకు ముఖ్య గమనిక. రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

Advertisement

ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని జులై 17న కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలు స్వీకరించమని తేల్చిచెప్పింది. దయచేసి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపింది టీటీడీ.

ఈ క్రమంలో జులై 13, జులై 16న వీఐపీ బ్రేక్‌ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. ఇక జులై 17 ఆణివార ఆస్థానం సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది.

ALSO READ: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఏపీ టు పుదుచ్చేరికి వెళ్లే పలు రైళ్లు రద్దు 

ఇదిలాఉండగా శనివారం తిరుమల శ్రీవారిని 90,546 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నవారు 36,303 మంది భక్తులు ఉన్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.భక్తులకు 4.61 లక్షల లడ్డూలను విక్రయించింది.

2.54 లక్షల మందికి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసింది. అలాగే భక్తులు వైద్య సహాయం కింద 3,162 మంది అందించినట్లు తెలియజేసింది. గదుల కోసం భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోందని వెల్లడించింది టీటీడీ.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×