E-Paper
Advertisement

పర్ఫెక్ట్ మాస్క్ వెనకున్న డార్క్ సీక్రెట్… ‘ఎప్స్టీన్ ఫైల్స్’ను గుర్తుచేసే అన్ ఫర్గెటబుల్ మాస్టర్ పీస్

పర్ఫెక్ట్ మాస్క్ వెనకున్న డార్క్ సీక్రెట్… ‘ఎప్స్టీన్ ఫైల్స్’ను గుర్తుచేసే అన్ ఫర్గెటబుల్ మాస్టర్ పీస్
Advertisement

Psychological Thriller: రీసెంట్ గా తెరపైకి వచ్చిన ‘ఎప్స్టీన్ ఫైల్స్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకవైపు ప్రపంచం యుద్ధం భయంతో వనికిపోతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించిన ప్రూప్స్ అంటూ కొన్ని ఒళ్లు గగుర్పొడిచే ఊహకు కూడా అందని వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అచ్చం ఇలాంటిదే. 2000లో విడుదలైన ఈ హాలీవుడ్ ఐకానిక్ సైకలాజికల్ హారర్-బ్లాక్ కామెడీ థ్రిల్లర్ పేరు ‘అమెరికన్ సైకో’ (American Psycho).

కథలోకి వెళ్తే…

1980ల న్యూయార్క్ లో కథ షురూ అవుతుంది. లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఖరీదైన సూట్లు, ట్రెండీ రెస్టారెంట్లు… ఇలాంటి ఆడంబరమైన జీవితం గడుపుతాడు యంగ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ పాట్రిక్ బేట్‌మన్ (క్రిస్టియన్ బేల్). అతను చూడడానికి చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తాడు. హ్యాండ్‌సమ్, స్టైలిష్, ఫిట్ బాడీ, ఖరీదైన గాడ్జెట్స్. అతని ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా అతను ఒక స్టేటస్ సింబల్. కానీ ఆ ఆడంబరమైన ముసుగు వెనుక ఒక భయంకరమైన సైకోపాత్ దాగి ఉంటాడు.

Advertisement

చిన్న చిన్న విషయాల్లోనూ తనకంటే ఇతరులు మెరుగ్గా ఉన్న వాళ్ళను చూస్తే బేట్‌మన్‌కు తీవ్ర ఈర్ష్య, అహంకారం పెరుగుతుంది. ముఖ్యంగా తన సహోద్యోగి పాల్ అలెన్ బిజినెస్ కార్డ్ తన కార్డ్ కంటే మెరుగ్గా ఉందని గమనించిన తర్వాత అతని మనసు మరింత వికృతంగా మారుతుంది. ఒకరోజు రాత్రి తన అపార్ట్‌మెంట్‌కు పాల్ అలెన్‌ను పిలిచి, హ్యూ లూయిస్ ఆల్బమ్ వినిపిస్తూ గొడ్డలితో అతన్ని అతి దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకుంటాడు.

ఈ హత్య తర్వాత బేట్‌మన్ లోని క్రూరత్వం మరింత పెరిగిపోతుంది. అతను రోడ్డుపై ఉండే అనాథలను, కుక్కలను, ఎస్కార్ట్ గర్ల్స్‌ను తన ఇంటికి తీసుకొచ్చి, భయంకరంగా హింసించి చంపేస్తాడు. కాలక్రమేణా అతను పూర్తిగా విచక్షణ కోల్పోతాడు. ఓ రాత్రి ATM మెషిన్ వద్దకు వెళ్లినప్పుడు ఆ మెషిన్ తనతో మాట్లాడినట్లు భ్రమపడతాడు. ఆ తర్వాత ఒక వృద్ధురాలు, ఇద్దరు పోలీసులు, సెక్యూరిటీ గార్డును కాల్చి చంపేస్తాడు. చివరికి తాను చేసిన హత్యల గురించి తన లాయర్‌కు ఫోన్ చేసి వాయిస్ మెసేజ్ పెడతాడు.

Advertisement

కానీ మరుసటి రోజు ఆ లాయర్ అతన్ని కలిసి, “నువ్వు పాల్ అలెన్‌ను చంపావా? నేను మొన్ననే లండన్‌లో అతనితో డిన్నర్ చేశాను” అని చెప్తాడు. ఇక్కడే సినిమాలో మేజర్ ట్విస్ట్ ఇస్తుంది. బేట్‌మన్ చేసిన హత్యలన్నీ నిజమా? లేక అతని వికృత మనస్సు సృష్టించిన భ్రమలా? అనే ప్రశ్నకు సమాధానమే ఈ మూవీ.

క్రిస్టియన్ బేల్ అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పటికీ కల్ట్ క్లాసిక్‌గానే ఉంది. మేరీ హారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంపన్న సమాజం అహంకారాన్ని సెటైరికల్ గా చూపించారు. ముఖ్యంగ క్రిస్టియన్ బేల్ స్మైల్, డైలాగ్స్, హింసాత్మక సన్నివేశాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రస్తుతం ఈ మూవీ Amazon Prime Video, Airtel Xstream Playలో ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. కానీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ప్రియులు మిస్ అవ్వకుండా చూడాల్సిన కల్ట్ క్లాసిక్ ఇది.

Read Also : షెర్లాక్ హోమ్స్ కిడ్నాప్… తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×