E-Paper
Advertisement

BR Naidu missing: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ.. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఫ్లెక్సీ కలకలం.

BR Naidu missing: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ..  అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఫ్లెక్సీ కలకలం.
Advertisement

BR Naidu missing: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మ‌రోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం  చైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా వెలిసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం కాంపౌండ్ వాల్‌కు “టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదు” అంటూ వైసీపీ శ్రేణులు ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి. పాలనలో చైర్మన్ వైఫల్యాలను ఎండగట్టేందుకే వైసీపీ కార్యకర్తలు ఈ వినూత్న నిరసన చేపట్టిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ వివాదంలో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది తీరు ఇప్పుడు విమర్శల పాలవుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పరిపాలన భవనం వద్ద అంత పెద్ద ఫ్లెక్సీ కడుతున్నా సెక్యూరిటీ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. అడుగడుగునా నిఘా ఉండే చోట ఫ్లెక్సీ వెలిసినా అధికారులు స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని భక్తులు విమర్శిస్తున్నారు. ఫ్లెక్సీ వేసిన వారిపై కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకపోవడం వెనుక లోతైన కారణాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఈ వ్యవహారంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిపై పచ్చ దళం మండిపడుతోంది. భద్రతా సిబ్బంది వైసీపీకి అంటకాగుతున్నారని అందుకే ఫ్లెక్సీని అడ్డుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ పరమైన నిరసనలు తెలుపుతుంటే మౌనంగా ఉండటం వెనుక అంతరార్థం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చైర్మన్ పట్ల అగౌరవంగా వ్యవహరించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ ఆరోపణలు విమర్శలు ఎలా ఉన్నా టీటీడీ వంటి పవిత్ర సంస్థ పరిధిలో ఇలాంటి చర్యలు జరగడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  తిరుపతిలో నెలకొన్న ఈ ఫ్లెక్సీ వివాదం శాంతిభద్రతల సమస్యగా మారకముందే పోలీసులు జోక్యం చేసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు ఈ భద్రతా లోపంపై ఎలాంటి విచారణ జరుపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Read Also:  కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా: 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత హరీష్ రాణాకు విముక్తి!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×