E-Paper
Advertisement

Portable Washing Machines: రూ.1000 లోపే వాషింగ్ మెషీన్.. మడతపెట్టి ఎక్కడికైనా పట్టుకెళ్లిపోవచ్చు!

Portable Washing Machines: రూ.1000 లోపే వాషింగ్ మెషీన్.. మడతపెట్టి ఎక్కడికైనా పట్టుకెళ్లిపోవచ్చు!
Advertisement

Portable Washing Machines: మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవనశైలిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నగరాల్లో ఇరుగ్గా ఉండే చిన్న చిన్న అద్దె ఇళ్లలో ఉండేవారికి, బ్యాచిలర్లకు లేదా హాస్టల్ విద్యార్థులకు పెద్ద సైజు వాషింగ్ మెషీన్లు కొనడం ఒక ఎత్తయితే.. వాటిని సెట్ చేసుకోవడం, ఖాళీ చేసేటప్పుడు మోసుకెళ్లడం పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికే ‘పోర్టబుల్ వాషింగ్ మెషీన్లు’ మార్కెట్లోకి వచ్చాయి. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉండటమే కాదు.. వీటిని ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లొచ్చు.

పోర్టబుల్ వాషింగ్ మెషీన్ అంటే?

సాధారణంగా మనం వాడే పెద్ద పెద్ద మెషీన్లతో పోలిస్తే ఇవి చాలా తేలికగా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా రెండు రకాలున్నాయి. ఒకటి ‘ఫోల్డింగ్ రకం’.. దీన్ని వాడుకున్నంత సేపు వాడుకుని, తర్వాత మడతపెట్టి ఏదో ఒక మూలన పడేయొచ్చు. ఇది సుమారు 1 – 3 కేజీల బట్టలకు సరిపోతుంది. ఇక రెండోది ‘సెమీ ఆటోమేటిక్ పోర్టబుల్ మెషీన్’. ఇది కొంచెం పెద్దగా ఉండి 3 – 6 కేజీల వరకు బట్టలను ఉతుకుతుంది. ఈ మెషీన్ల వల్ల నీళ్లు, కరెంటు చాలా తక్కువగా ఖర్చవుతాయి. మన ఇంట్లో ఉండే మామూలు ప్లగ్ పాయింట్‌కే వీటిని తగిలించి వాడేసుకోవచ్చు.

Advertisement

Also Read: టాప్ బ్రాండ్ ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 55% తగ్గింపు.. కొద్దిరోజులే ఈ అవకాశం!

రూ.2వేల లోపే మినీ ఫోల్డబుల్ మెషీన్లు..

ఏంటీ.. రెండు వేలకే వాషింగ్ మెషీన్ వస్తుందా? అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. కానీ అది నిజమేనండి. వీటినే ‘మినీ ఫోల్డబుల్ మెషీన్లు’ అంటారు. ఇవి చూడటానికి చిన్న బకెట్ లాగా ఉండి, సిలికాన్ మెటీరియల్‌తో వస్తాయి. బట్టలు ఉతకడం అయిపోగానే వీటిని చాపలా మడతపెట్టి బ్యాగులో కూడా పెట్టేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వీటి ధర రూ.600 నుంచి రూ.1,800 మధ్యలోనే ఉంటుంది. అయితే, ఇక్కడో చిన్న విషయం గుర్తుంచుకోవాలి.. వీటిలో కేవలం లోదుస్తులు, సాక్స్, రుమాళ్లు లేదా చిన్న పిల్లల బట్టలు మాత్రమే ఉతకడానికి వీలవుతుంది. భారీగా ఉండే చీరలు, కోట్లు, బెడ్ షీట్లు వేస్తే మాత్రం ఇవి తట్టుకోలేవు.

ఎవరెవకి ఉపయోగపడతాయి?

Advertisement

చిన్న అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి లేదా రూమ్ షేరింగ్‌లో ఉండే వాళ్లకు ఈ వాషింగ్ మెషీన్లు భలే సెట్ అవుతాయి. రోజువారీగా వాడే జిమ్ బట్టలు, సాక్స్ లాంటివి అప్పటికప్పుడు ఉతుక్కోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ముఖ్యంగా హాస్టల్స్‌లో ఉండే స్టూడెంట్స్ బట్టలు చేత్తో ఉతకలేక అల్లాడిపోతుంటారు కదా.. అలాంటి వారికి ఇవి తక్కువ ధరలోనే పనిని చాలా సులభం చేస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా క్యాంపింగ్‌కు వెళ్లేటప్పుడు కూడా ఈ ఫోల్డింగ్ మెషీన్లను కారులో వేసుకుని తీసుకెళ్లొచ్చు.

ఆఫర్ల వివరాలివే..

ప్రస్తుతం మన మార్కెట్లో ఈ మెషీన్ల ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోనే ఉన్నాయి. బడ్జెట్ మోడల్స్ రూ.2,000 లోపే దొరుకుతుండగా.. కొంచెం క్వాలిటీ ఉన్న బ్రాండెడ్ పోర్టబుల్ మెషీన్లు రూ.4,000 నుంచి రూ.7,000 మధ్యలో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సైట్లలో చూస్తే వీటిపై అప్పుడప్పుడు 40% – 80% వరకు భారీ ఆఫర్లు కూడా ఇస్తుంటారు. పండుగ సీజన్లలో బ్యాంక్ ఆఫర్లు కూడా కలిస్తే ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: ఒక్కసారిగా పడిపోయిన ప్రీమియం ఫ్రిడ్జ్‌ల ధరలు.. ఏకంగా రూ.43,000కి పైగా డిస్కౌంట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×