E-Paper
Advertisement

Mla Kolikapudi: నువ్వు పేకాట కబ్ల్ కు అధ్యక్షుడివా?.. ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్ లు వైరల్

Mla Kolikapudi:  నువ్వు పేకాట కబ్ల్ కు అధ్యక్షుడివా?.. ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్ లు వైరల్
Advertisement

Mla Kolikapudi: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన కొలికపూడి.. తాజాగా వాట్సాప్ స్టేటస్ లతో ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులను టార్గెట్ చేశారు. విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును లక్ష్యంగా చేసుకుని వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టారు. ‘‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్ కా? పేకాట కోసం ఆఫీస్‌ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్‌’’ అని వాట్సాప్ స్టేటస్‌ పెట్టారు. కొంటపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ అంటూ కొలికపూడి వరుస వాట్సాప్ స్టేటస్ లు పెట్టారు. వాట్సాప్ స్టేటస్ లపై ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇస్తూ.. చాలాకాలంగా రాయల సుబ్బారావు పేకాట ఆడిస్తున్నారని ఆరోపించారు.

తీరు మార్చుకోని కొలికపూడి

గతంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై బహిరంగ ఆరోపణలు చేశారు కొలికపూడి. దీంతో పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించారంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలికపూడిని పిలిపించి వివరణ తీసుకుంది టీడీపీ అధిష్టానం. అయినా కొలికపూడి తీరు మారకపోవడం విశేషం. తాజాగా మరోసారి టీడీపీ వర్గీయుల లక్ష్యంగా విమర్శలు చేశారు.

అధిష్టానానికి తలనొప్పిగా

Advertisement

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారారు. గతంలో తిరువూరు బెల్ట్ షాపులు పెరిగిపోయాయని టీడీపీ నేతలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అప్పుడే టీడీపీ అధిష్టానం కొలికపూడిని పిలిచించి మందలించింది. ఆ తర్వాత కొలికపూడి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎయిర్‌పోర్ట్‌లో కలవడం పెనుదుమారం రేపింది. పెద్దిరెడ్డి ఎయిర్ పోర్టులో కనిపిస్తే పలకరించానని, అంతకు మించి ఏంలేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకున్నారు.

Also Read: Bhanu Prakash Reddy: సిగ్గుందా జగన్..! టీటీడీ ఘటనలపై భానుప్రకాష్ ఫైర్

కేశినేని వర్సెస్ కొలికపూడి

Advertisement

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ పై సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని బ్యాంక్ స్టే్ట్మెంట్ పెట్టారు. కేశినేని చిన్ని లక్ష్యంగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత ఇరువురు నేతలు నేరుగా విమర్శలు చేసుకున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగి ఇద్దరు నేతలను హెచ్చరించింది. పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది. కొలికపూడి, కేశినేనిని పిలిచి వివరణ తీసుకుంది. ఈ వివాదం ముగిసిందనుకున్న సమయంలో మరోసారి కొలికపూడి సొంత పార్టీ నేతలను మరోసారి టార్గెట్ చేశారు. ఇలా వరుసగా వివాదాలకు కారణమవుతున్న ఎమ్మెల్యే కొలికపూడిపై పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×