E-Paper
Advertisement

Bhanu Prakash Reddy: సిగ్గుందా జగన్..! టీటీడీ ఘటనలపై భానుప్రకాష్ ఫైర్

Bhanu Prakash Reddy: సిగ్గుందా జగన్..! టీటీడీ ఘటనలపై భానుప్రకాష్ ఫైర్
Advertisement

Bhanu Prakash Reddy: తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాలపై.. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యంమేలింది ఆయన ఆరోపించారు.

టీటీడీ ధర్మకర్త మండలి, ముఖ్యాధికారులు, అధ్యక్షులపై కూడా ఆయన విమర్శలు చేశారు. స్వామివారి పవిత్రత దెబ్బతిన్నట్లు వ్యాఖ్యానించారు. అందుకు నిదర్శనం రధాలు తగలబెట్టడం , హిందూ దేవాలయ పై దాడి చేయడం అన్నారు. ఆలయాన్ని అడ్డంపెట్టుకుని అపాచారాలు, అవినీతికి పాల్పడ్డారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రను దెబ్బతీశారు అంటూ విమర్శలు గుప్పించారు.

Advertisement

స్వామివారి ప్రసాదం లడ్డూ నాణ్యత గత ప్రభుత్వ కాలంలో దెబ్బతిన్నట్లు ఆయన ఆరోపించారు. భక్తులు ఎంతో భక్తితో తీసుకునే లడ్డూలో పొరలు వచ్చేవి, వాసన కనిపించేది. నేను ఈ విషయాన్ని అప్పటి టీటీడీ చైర్మన్‌కు చెప్పినా తీసుకోలేదు అని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు.

టీటీడీ పరకామణి విభాగంలో ఉద్యోగిగా పనిచేసిన రవికుమార్.. డాలర్లు దొంగిలించిన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఘటనపై భాను ప్రకాశ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.

Advertisement

అంత పెద్ద అవకతవకను చిన్న దొంగతనం అని ఎందుకు పేర్కొన్నారు? అదే సంఘటన చర్చి వద్ద జరిగి ఉంటే కూడా ఇదే మాట చెప్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. ఎక్కడికి మాయమైనట్లు కూడా ఆయన ప్రశ్నించారు.

రవికుమార్ కేసులో దర్యాప్తు ప్రారంభమైన వెంటనే.. కొంతమంది పోలీసు అధికారులు ఒత్తిడికి గురయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి విషాదకరమని, దాని వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

Also Read: విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు సీఎం‌ శంకుస్థాపన

రవికుమార్ దొంగతనం చేసిన తర్వాత తన ఆస్తులను.. టీటీడీకి రాయించుకున్నాడని గత ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా, దాని వెనుక ఉన్న అనుమానాలను భాను ప్రకాశ్ రెడ్డి లేవనెత్తారు. దొంగతనం చేసి గిఫ్ట్ ఇచ్చినట్టుగా చెప్పారు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ వ్యవహారంపై నిజాలు ప్రజల ముందుకు రావాలి అని డిమాండ్ చేశారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×