E-Paper
Advertisement

Tirumala Controversy: ఏపీ రాజకీయ రచ్చతో.. అల్లాడుతున్న తిరుమల వెంకన్న.. కలికాలం అంటే ఇదే!

Tirumala Controversy: ఏపీ రాజకీయ రచ్చతో.. అల్లాడుతున్న తిరుమల వెంకన్న.. కలికాలం అంటే ఇదే!
Advertisement

Tirumala Controversy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. గత కొన్నిరోజులుగా తిరుమల చుట్టూ తిరుగుతున్నాయి. సాధారణంగా దేవుళ్ల చుట్టూ రాజకీయ పంచాయతీలు ఏపీలో చాలా అరుదుగా చూస్తుంటాం. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడు కొండల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ప్రస్తుతం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి, జంతుకొవ్వు వివాదం, టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు వీడియోలతో గత కొన్ని రోజులుగా నిత్యం టీటీడీ ఆలయం వార్తల్లో నిలుస్తూనే ఉంది. సరే ఇకనైనా ఈ వివాదం ముగుస్తుందనుకున్న తరుణంలో వైసీపీ మళ్లీ ఇంకో సరికొత్త ఆరోపణలతో మళ్లీ శ్రీవారిని వార్తల్లోకి లాగింది.

పరకామణిలో చోరీపై వైసీపీ పోస్ట్..

కూటమి ప్రభుత్వ హయాంలో ప‌ర‌కామ‌ణిలో రూ.కోటి విలువైన 555 గ్రాముల బంగారం చోరీ జరిగిందంటూ విపక్ష వైసీపీ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేసింది. 157 గ్రామాల వెండి కానుక‌లు సైతం చోరీకి గురైనట్లు విమర్శలు చేసింది. శ్రీవారి సొత్తును దోచుకుంటూ పరకామణి ఉద్యోగి పెంచలయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని.. 2024లో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ద‌ర్జాగా దొంగ‌త‌నాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపించింది. ప‌ర‌కామ‌ణి దొంగ‌ల‌కు ప్ర‌భుత్వ పెద్ద‌ల ద‌న్నుగా నిలుస్తున్నారని పేర్కొంది. దీనిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీసింది.

Advertisement

రాజకీయ ఆయుధంగా టీటీడీ!

సాధారణంగా రాజకీయ పార్టీలు.. పాలసీలు, పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల కేంద్రంగా ఆరోపణలు చేసుకుంటాయి. కానీ ఏపీలో కొద్దిరోజులుగా టీటీడీ కేంద్రంగా మాటల యుద్ధానికి దిగడంపై శ్రీవారి భక్తులకు రుచించడం లేదు. ఆఖరికి ఆ పార్టీకి చెందిన కేడర్ సైతం.. తమ అధినేతలు అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశ, విదేశాల నుంచి వచ్చి స్వామివారికి మెుక్కులు చెల్లించుకుంటారు. కలియుగ దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. అలాంటి తిరుమలను ఇలా రాజకీయ విమర్శలకు వాడుకొని.. టీటీడీ ప్రతిష్టను పలుచన చేయవద్దని రాజకీయ నిపుణులు, భక్తులు కోరుకుంటున్నారు.

Advertisement

Also Read: Portable AC Offers: అమేజింగ్ సమ్మర్ సేల్.. అత్యంత చౌకగా పోర్టబుల్ ఏసీలు.. భలే ఛాన్సులే!

ఇంత రచ్చ అవసరమా?

రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే టీటీడీలో ఏదైనా అవకతవకలు చోటుచేసుకుంటే.. దానిపై సైలెంట్ గా దర్యాప్తు చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న శ్రీవారి లడ్డు, పరకామణి కానుకల అంశాన్ని ప్రెస్ మీట్లు పెట్టి మరీ రచ్చ చేయకుండా.. తెరవెనుక ఫిర్యాదుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. టీటీడీ చుట్టూ ఇలాగే రాజకీయ రచ్చ కొనసాగిస్తూ పోతే.. మెుదటికే మోసానికి వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీలోని శ్రీవారి భక్తుల్లో అసహనం, అసంతృప్తి కట్టలు తెంచుకుంటే అది.. పార్టీల భవితవ్యాన్ని, నేతల రాజకీయ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

Also Read: Richest Actresses: టాప్ 10 అత్యధిక ధనవంతుల జాబితా.. మీ ఫేవరెట్ హీరోయిన్ ఆస్తి ఎంతంటే?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×