// // Kalvakuntla Kavitha: కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్! -->
E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: పేదల గుడిసెలు కూల్చి.. పెద్దలకు కట్టబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్!

Kalvakuntla Kavitha: పేదల గుడిసెలు కూల్చి.. పెద్దలకు కట్టబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్!
Advertisement

Kalvakuntla Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటం ఉధృతమైంది.

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పరిధిలోని 62 ఎకరాల భూదాన్ భూమిలో గత పదేళ్లుగా సుమారు 750 పేద కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, ఈ భూమి విలువ పెరగడంతో సంపన్నులకు కట్టబెట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అర్థరాత్రి వేళ బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేసింది. నిరాశ్రయులైన బాధితులను ప్రభుత్వం స్థానిక అంబేద్కర్ భవన్‌కు తరలించి గాలికి వదిలేసింది. వందలాది కుటుంబాలు ఒకే చోట సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా, జిల్లా కలెక్టర్ కానీ, ప్రభుత్వం కానీ స్పందించకపోవడం గమనార్హం.

Advertisement

బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత, డాక్టర్ విశారదన్ , బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్లతో కలిసి ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనను అణచివేసేందుకు పోలీసులు అమానుషంగా వ్యవహరించి వారిని అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి కవిత నిరాహార దీక్ష చేపట్టగా.. అర్ధరాత్రి వేళ వేలమంది పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా హైదరాబాద్‌కు తరలించి జాగృతి కేంద్ర కార్యాలయంలో వదిలిపెట్టారు. ప్రస్తుతం ఆమె తన దీక్షను అక్కడే కొనసాగిస్తున్నారు.

తెలంగాణ జాగృతి ఈ సందర్భంగా ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ‘ఇళ్లు కూల్చివేసిన చోటే పేదలకు ప్లాట్లు కేటాయించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఈ భూ కుంభకోణంపై స్వతంత్ర జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల హస్తం దీని వెనుక ఉందని బాధితులు బలంగా నమ్ముతున్నారు’. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలో పేదల ఇళ్లను ధ్వంసం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ జాగృతి లేఖ రాసింది.

Advertisement

పేదల భూములను పెద్దలకు కట్టబెట్టే ఈ ‘ప్రజా వ్యతిరేక’ విధానాలపై పోరాటం ఆగదని, బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

Also Read:  మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×