E-Paper
Advertisement

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్
Advertisement

Tirumala Brahmotsavam 2025: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పవిత్రమైన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే అత్యంత ప్రధానమైన ఉత్సవాలు. ఈ తొమ్మిది రోజుల పండుగలో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్‌ను ఇప్పుడు చూద్దాం.

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 2025:

Advertisement

సెప్టెంబర్ 23, మంగళవారం:
బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యే ముందు రోజు రాత్రి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జరిగే ఈ క్రతువులో.. విష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు నాంది పలుకుతారు.

సెప్టెంబర్ 24, బుధవారం – 1వ రోజు:
మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం ఉంటుంది. సాయంత్రం 5:45 గంటలకు ద్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా మొదలవుతాయి. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

Advertisement

సెప్టెంబర్ 25, గురువారం – 2వ రోజు:
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చిన శేష వాహనంపై ఊరేగుతారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం (అభిషేకం) నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 వరకు స్వామివారు హంస వాహనంపై విహరిస్తారు.

సెప్టెంబర్ 26, శుక్రవారం – 3వ రోజు:
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సింహవాహనంపై దర్శనమిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు తిరిగి స్నపన తిరుమంజనం ఉంటుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యాల పల్లకి వాహనంపై ఊరేగుతారు.

సెప్టెంబర్ 27, శనివారం – 4వ రోజు:
ఉదయం 8 నుంచి10 గంటల వరకు కల్ప వృక్ష వాహనంపై ఊరేగింపు ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతారు.

సెప్టెంబర్ 28, ఆదివారం – 5వ రోజు :
ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 6:30 నుంచి 11:30 వరకు అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడ వాహన సేవ జరుగుతుంది.

Also Read: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

సెప్టెంబర్ 29, సోమవారం – 6వ రోజు:
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగుతారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం ఉంటుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు.

సెప్టెంబర్ 30, మంగళవారం – 7వ రోజు:
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్య ప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్ర ప్రభ వాహనంపై దర్శనమిస్తారు.

అక్టోబర్ 1, బుధవారం – 8వ రోజు:
ఉదయం సుమారు 6 గంటలకు రథోత్సవం వైభవంగా జరుగుతుంది. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు అశ్వ వాహనంపై ఊరేగింపు ఉంటుంది.

అక్టోబర్ 2, గురువారం – 9వ రోజు:
ఇది బ్రహ్మోత్సవాల చివరి రోజు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం సుమారు 7 గంటలకు ద్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×