// // OG First Review - పూర్ వీఎఫ్ఎక్స్.. మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే! -->
E-Paper
Advertisement

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!
Advertisement

OG Movie First Review: వర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘ఓజీ‘(OG Movie). ‘సాహో‘ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పవన్‌ సినిమాల్లో అత్యంత హైప్‌ ఉన్న చిత్రమిది. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్‌, టిజర్‌ మూవీపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలో ట్రైలర్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు మూవీ ట్రైలర్‌ విడుదల కానుంది. ఆదివారం(సెప్టెంబర్‌ 21) ఓజీ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే ఈ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేయనున్నారు. అయితే ఓజీ మూవీ టీంకి హైప్‌ బెడద పట్టుకుంది.

మూవీపై ఓవర్ హైప్..

Advertisement

సినిమాపై ఓవర్‌ హైప్‌ మంచిది కాదని, అంచనాలను మించిన హైప్‌ ఉంటే.. అది ఫలితంపై దెబ్బ పడుతుందని జంకుతున్నారు. ‘హరి హర వీరమల్లు‘రిజల్ట్‌ రిపీట్‌ అవ్వకుండ ట్రైలర్‌ కట్‌లో జాగ్రత్తలు పడుతున్నారట. ఈ క్రమంలో ఓజీ మూవీకి సంబంధించిన ఓ టాక్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. OG Movie First Review అంటూ ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇంతకి ఓజీ ఫస్ట్‌ టాక్‌ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. హరి హర వీరమల్లు మూవీ ఫలితం అంచనాలను తారుమారు చేసింది. HHVM ఇండస్ట్రీ హిట్‌ కొడుతుందని, వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం పక్కా అనుకున్నారు. కానీ, ఈ సినిమాలోని పూర్‌ వీఎఫ్‌ఎక్స్‌, ల్యాగ్‌ సీన్స్‌.. క్లారిటీ లేని స్క్రీన్‌ ప్లే మూవీకి నెగిటివ్‌ టాక్‌ తెచ్చింది. నిజానికి సినిమాలో మంచి కథ ఉంది. కానీ, ఓవర్‌ హైప్‌ వల్ల అది కిల్‌ అయ్యింది.

పూర్ వీఎఫ్ఎక్స్, వీక్ సాంగ్స్

దానికి పూర్‌ వీఎఫ్‌ఎక్స్‌ తోడు కావడంతో సినిమా కమర్షియల్‌గా ఫెయిల్‌ అయ్యింది. అయితే అది ఓజీలో రిపీట్‌ కావద్దని చూస్తున్నారు మేకర్స్. కానీ, మూవీకి వస్తున్న ఫస్ట్‌ టాక్‌ మాత్రం ఫ్యాన్స్‌ ని ఆందోళన కలిగిస్తోంది.  ఓజీలో అడుగుడునా హీరోకి ఓవర్‌ ఎలివేషన్స్‌ ఇచ్చారట. అవసరం లేని చోట కూడా బీజీఎం, హీరో ఎలివేషన్స్ ఆడియన్స్‌కి విసుగు తెప్పించేలా ఉందట. అలా ఫస్టాఫ్ మొత్తం సాగుతుండటంతో ఆడియన్స్‌ నిరాశ గురయ్యే అవకాశం ఉందని టాక్‌. ఓవర్‌ల్‌గా చూస్తే ఫస్టాఫ్‌ దారుణంగా ఉందనే టాక్‌ వినిపిస్తోంది. ఇక సెకండాఫ్‌ కూడా అంతేనట. సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ పేలవంగా ఉందని అంటున్నారు. సాంగ్స్‌ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవట. ముఖ్యంగా పవన్‌ పాడిన జపాన్‌ సాంగ్‌ ఎందుకురా బాబు అనేట్టు ఉందట. 

Advertisement

Also Read: Bandla Ganesh: మరోసారి అల్లు అరవింద్‌పై బండ్లన్న కామెంట్స్‌.. అంతమాట అనేశాడేంటి..

పూర్‌ సీజీ వర్క్‌, వీక్‌ సాంగ్స్‌ వల్ల మూవీకి నెగిటివ్‌ టాక్‌ వచ్చేలా ఉందని తెలుస్తోంది. కానీ, సినిమా మొత్తంలో 15 నిమిషాలు మాత్రమే ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఈ 15 నిమిషాలు.. సినిమాను నిలబెట్టేలా ఉందట. ఇక ఓపికతో ప్రేక్షకులు ప్రీ క్లైమాక్స్‌ వరకు వేచి ఉంటే.. సినిమా చూడోచ్చు అంటున్నారు. అక్కడ  వచ్చే ఎలివేషన్ సీన్స్, హీరో, విలన్ మధ్య ఉండే యాక్షన్‌ సీన్స్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు బలం. వాటి వల్ల ఓజీ పర్వాలేదు అనిపిస్తుందట. మరి రిలీజ్‌ తర్వాత ఓజీ ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక పవన్‌ కళ్యాణ్‌కి, ఫ్యాన్స్ కి‌ ఓజీ హిట్‌ చాలా ముఖ్యం. మరి ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్ పవన్‌ రీచ్‌ అవుతాడా? లేదా తెలియాలంటే సెప్టెంబర్‌ 25 వరకు ఆగాల్సిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×