E-Paper
Advertisement

Sankranti Festival: గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి జోరు.. బరిలోకి దిగుతున్న పందెం కోళ్లు!

Sankranti Festival: గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి జోరు.. బరిలోకి దిగుతున్న పందెం కోళ్లు!
Advertisement

Sankranti Festival: ఈసారి సంక్రాంతికి కోడిపందాలకు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ బరిలో పందాలు జోరుగా జరుగుతాయి? హైయెస్ట్ పందాలు ఎక్కడ వేస్తారు? పందాలతో పాటు సౌకర్యాలు ఎక్కడ ఉంటాయి? గోదావరి జిల్లాల్లో ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడే మొదలయ్యాయి. ఇప్పటి నుంచే సంక్రాంతి పండుగ షెడ్యూల్‌ను రెడీ చేసుకుంటున్నారు. కోడి పందాలు చూసేందుకు.. కాసేందుకు.. ఎవరి ఏర్పాట్లను వారు చేసుకుంటున్నారు. మరికొందరు ఇప్పటి నుంచే డబ్బులు కూడా సర్దుబాటు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

గోదావరి జిల్లాలో ఇప్పటికే సంక్రాంతి శోభ మొదలైంది. సంక్రాంతి పండుగకు మరో నెల రోజులు సమయమే ఉండటంతో తమ కోడిపుంజులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు పందెం రాయుళ్లు. ముందుగా పందాలకు సిద్ధంగా ఉండే కోడిపుంజులు ఎక్కడ ఉన్నాయో అని పందెం రాయుళ్లు వెతకని చోటంటూ ఉండదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో భీమవరంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పందేలు చూడటానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుండి పందెం రాయుళ్లు గోదావరి జిల్లాలు చేరుకుంటారు.

Advertisement

గోదావరి జిల్లాలో చదువుకునీ దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు సంక్రాంతి పండగకు సొంతూరులు చేరుకుంటారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన వాళ్లు ఇప్పటికే గ్రామాలకు చేరుకుని సందడి చేస్తున్నారు. కోడి పుంజులు ఎక్కడ బాగుంటాయో ఎక్కడ పుంజును కొంటే పందెంలో గెలుపు గ్యారెంటీ అని ప్రచారం జరుగుతుందో అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.

పందెం పుంజు కొనుగోలు చేయటం అంటే మాటలు కాదు. పందెం పుంజు బ్రీడ్, బ్లడ్ లైన్ ముఖ్యంగా గతంలో గెలిచిన పందెం వివరాలను సైతం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు పందెం రాయుళ్లు. ఒక్కో పుంజు లక్ష రూపాయలకు పైమాటే అంటే అతిశయోక్తి కాదు. దీనినే క్యాష్ చేసుకుంటున్నారు కోడిపుంజుల దొంగలు. ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండవో, సరైన రక్షణ తీసుకోరో అలాంటి వారి తోటలోకి వెళ్లి పందెం పుంజులను దొంగలించి తీసుకువెళ్లి పోతున్నారు. ఏడాది పాటు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి పెంచిన పుంజులు సరిగ్గా సీజన్ వచ్చే సమయానికి దొంగలు ఎత్తుకుపోవడంతో నష్టపోతున్నాం అంటున్నారు పందెం పుంజులను పెంచే రైతులు. ఇటీవల ఉంగుటూరు నియోజకవర్గంలో 30 కోడి పుంజులు, తాడేపల్లిగూడెం సమీపంలో మరొక ఐదు కోడిపుంజులను ఎత్తుకెళ్లిపోయారు దొంగలు.

Advertisement

ఈ దొంగతనాలు పెరుగుతుండటంతో పందెం పుంజులను పెంచేవారు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పందెం పుంజులు ఉన్న షెడ్డు దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, కుక్కలను కాపలాగా ఉంచుతున్నారు. కోడిపుంజు బలంగా ఉండి, తెలియని వ్యక్తులు రేటు తక్కువకు అమ్ముతుంటే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలని వేడుకుంటున్నారు రైతులు.

అయితే రోజురోజుకు డెవలప్‌అవుతున్న టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటున్నారు పందెం రాయుళ్లు. కాయ్ రాజా కాయ్ అంటూ బరుల వద్ద పలికే పాత పద్ధతికి స్వస్తి పలికి.. ఆన్‌లైన్‌లోనే కోడిపుంజులను ఎంపిక చేసుకునే పద్ధతిని తీసుకొస్తున్నారు. మొన్నటి వరకు అయితే కోడి పుంజులు ఎక్కడ ఉన్నాయో సమాచారం తెలుసుకుని వాటి దగ్గరికి వెళ్లి అన్ని పరీక్షించుకుని పందెం రాయుళ్లు కోడిపుంజులను కొనేవారు. కాని దీనివల్ల సమయంతో వృధాతో పాటు ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని భావించి ఆన్లైన్ బాట పట్టారు. కానీ కోడిపుంజులను నేరుగా చూసి కొనుక్కుంటేనే పందెం రాయుళ్ళకు లాభం జరుగుతుంది తప్ప ఆన్లైన్లో చూసి కోడిపుంజులు కొనుగోలు చేయడం వల్ల అన్ని విధాలుగా నష్టం ఉంటుందంటున్నారు.

Also Read: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు.

సో.. గోదావరి జిల్లాల్లో పందెం రాయుల హడావుడి చూస్తుంటే 2026 సంక్రాంతి శోభ ముందే ప్రారంభమైనట్టు అనిపిస్తుంది . సాంప్రదాయ కోడిపందాల మాటున కత్తులు దూసుకోవటానికి కోడి పుంజులను సుశిక్షితులైన సైనికుల్లా సిద్ధం చేస్తున్నారు పందెం రాయుళ్లు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×