E-Paper
Advertisement

Nandyal TDP | నంద్యాలలో టిడిపి వర్గాల మూకుమ్మడి రాజీనామా!

Nandyal TDP | నంద్యాలలో తెలుగుతమ్ముళ్ల మధ్య వర్గపోరు బయటపడింది. నంద్యాల టీడీపీ ఇంఛార్జ్‌గా NMD ఫరూఖ్‌ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇంఛార్జి మార్పుపై భూమా బ్రహ్మానంద రెడ్డి వర్గం.. ఆగ్రహానికి గురైంది. కార్యకర్తలకు అండగా నిలిచిన భూమా బ్రహ్మానంద రెడ్డిని అధిష్టానం గుర్తించకపోవడంపై.. ఆ వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్డు,గ్రామ ఇంచార్జులు,బూత్ కన్వీనర్లు, క్లస్టర్ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేశారు.

Nandyal TDP | నంద్యాలలో టిడిపి వర్గాల మూకుమ్మడి రాజీనామా!
Advertisement
Nandyal TDP News

Nandyal TDP News(Andhra pradesh political news today):

నంద్యాలలో తెలుగుతమ్ముళ్ల మధ్య వర్గపోరు బయటపడింది. నంద్యాల టీడీపీ ఇంఛార్జ్‌గా NMD ఫరూఖ్‌ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇంఛార్జి మార్పుపై భూమా బ్రహ్మానంద రెడ్డి వర్గం.. ఆగ్రహానికి గురైంది. కార్యకర్తలకు అండగా నిలిచిన భూమా బ్రహ్మానంద రెడ్డిని అధిష్టానం గుర్తించకపోవడంపై.. ఆ వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్డు,గ్రామ ఇంచార్జులు,బూత్ కన్వీనర్లు, క్లస్టర్ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేశారు.

తమ రాజీనామాలను పోస్టు ద్వారా అధిష్టానానికి పంపాలని భూమా వర్గం నిర్ణయించుకుంది. తన అనుచరులు ఎవరూ…రాజీనామా చేయవద్దని భూమా బ్రహ్మానంద రెడ్డి వారించినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత… రాజీనామాలపై నిర్ణయం తీసుకుందామని సర్థి చెప్పినట్లు సమాచారం.

Advertisement

మా నాయకుడికి మర్యాద దక్కనప్పుడు.. మాకు పదవులు ఎందుకంటున్నారు భూమా వర్గీయులు. భూమాకి టిక్కెట్ ఇవ్వాలంటూ డీజిల్ పోసుకుని.. ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో… విషయం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ మహిళను గుర్రం లక్ష్మిగా గుర్తించిన నేతలు.. ఆమెను ఆపి.. సర్థి చెప్పారు. తోటి కార్యకర్తలు బాటిల్ లాగేసుకోవటంతో ప్రమాదం తప్పింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×