E-Paper
Advertisement

AP : అగ్నిగుండంగా మారిన ఏపీ.. మరో రెండు రోజులు తీవ్ర వడగాల్పులు..

AP : అగ్నిగుండంగా మారిన ఏపీ.. మరో రెండు రోజులు తీవ్ర వడగాల్పులు..
Advertisement

Weather news andhra pradesh(AP updates): ఏపీ అగ్నిగుండంగా మారింది. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండుతున్నాయి. గురువారం ఉష్టోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. 210 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలోని 31 శాతం మండలాలు నిప్పుల గుండంగా మారాయి. మరో 220 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగానే ఉంది. మొత్తంగా 64 శాతంపైగా మండలాల్లోని ప్రజలు ఉష్ణతాపానికి అల్లాడారు. నర్సాపురంలో సాధారణం కంటే అధికంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.

Advertisement

శుక్ర, శనివారాల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 268 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. మరో 235 మండలాల్లో వడగాల్పుల ప్రభావంగా ఉంటుందని తెలిపింది.

గురువారం అనకాపల్లి జిల్లాలోని 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. విశాఖపట్నం జిల్లాలోని 8 మండలాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా సత్యవేడులో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే విశాఖపట్నం, బాపట్లలో 7.1 డిగ్రీలు, మచిలీపట్నంలో 6.9 డిగ్రీలు, జంగమహేశ్వరపురంలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డయ్యాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×