E-Paper
Advertisement

IT Raids : మూడోరోజూ ఐటీ దాడులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో సోదాలు..

IT Raids : మూడోరోజూ ఐటీ దాడులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో సోదాలు..
Advertisement

Income Tax raids in Telangana(Telugu breaking news today): తెలంగాణలో మూడో రోజూ ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. హోటల్‌ ఎట్‌ హోమ్‌, వైష్ణవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థ వాటి అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో చేపట్టిన సోదాల్లో 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ శాఖ దాడులు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రెండోరోజు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు చేశారు. మైలాన్ డిజిటల్ టెక్నాలజీలో కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి భాగస్వాములుగా ఉన్నట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు.

Advertisement

ముగ్గురు నేతలు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని గుర్తించారు. నేతల సతీమణులు, కుటుంబ సభ్యులు డైరెక్టర్స్‌గా ఉన్న కంపెనీలపై దృష్టిపెట్టారు. బ్యాంకు లాకర్స్‌ను సైతం ఓపెన్ చేసిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు, సమాచారం సేకరించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×