E-Paper
Advertisement

నెరవేరిన దశాబ్దాల నాటి కల.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. నేటి నుంచి కార్యకలాపాలు మొదలు

నెరవేరిన దశాబ్దాల నాటి కల.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. నేటి నుంచి కార్యకలాపాలు మొదలు
Advertisement

Visakhapatnam:  ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల నాటి కల నెరవేరింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి(జూన్ ఒకటి) నుంచి ప్రారంభమయ్యాయి. సిరిపురం జంక్షన్‌లో ఉన్న డెక్ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే ఆఫీసును ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడి నుంచి అధికారిక కార్యక్రమాలు మొదలయ్యాయి.

దశాబ్దాల నాటి ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరింది

Advertisement

ఏపీవాసుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. జూన్ ఒకటి అనగా నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పట్టాల కెక్కింది. విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. దీంతో 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగు అయ్యింది. సిటీలోని వీఎంఆర్‌డీఏ డెక్‌ భవనంలో తాత్కాలిక జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ఇకపై జోన్‌కు సంబంధించిన మెకానికల్, టెలి కమ్యూనికేషన్, సివిల్, పరిపాలన వ్యవహారాలు ఈ ఆఫీసు నుంచి కొనసాగనున్నాయి. ఈ జోన్ కింద గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నాలుగు డివిజన్లతో పని చేయనుంది. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన ఆఫీసులో జీఎంతోపాటు వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.

Advertisement

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలు

దశాబ్దాల విశాఖ వాసుల కల నెరవేర్చిన ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. విశాఖ వేదికగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభంతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధితోపాటు లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు తాత్కాలిక కార్యాలయాల్లో ప్రారంభాన్ని సింపుల్‌గా అధికారుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయగడ డివిజన్ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ ఎలాంటి హడావుడి లేకుండా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు సాఫీగా నేటి నుంచి జరగనున్నాయి.

ALSO READ: వైసీపీ స్క్రీన్‌ప్లే.. జగన్ డైరెక్షన్.. విగ్రహాల ధ్వంసం వెనుక నిజాలు ఇవే- ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

కొత్త జోన్ ద్వారా నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది. రైలులో ప్రయాణికుల సేవలు బలోపేతం కానున్నాయి. సరుకు రవాణా పెరగడం, ఈ ప్రాంతమంతా రైల్వే మౌలిక సదుపాయాలు, సామర్థ్య విస్తరణ ప్రాజెక్టుల అమలు వేగవంతం కాబోతోంది. కొత్త జోన్‌లో దాదాపు 17,000 మంది ఉద్యోగులు ఉండనున్నారు. రద్దీ సమయాల్లో 500కు పైగా రైళ్లు, 800కు పైగా గూడ్స్ రైళ్లను నిర్వహించగలదని ఓ అంచనా. ప్రధాన ఓడరేవులకు సరుకు రవాణా, మల్టీమోడల్ లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×