E-Paper
Advertisement

Snail in Simhachalam Prasadam: అప్పన్న ఆలయంలో అపచారం.. ప్రసాదంలో నత్త అవశేషాలు

Snail in Simhachalam Prasadam: అప్పన్న ఆలయంలో అపచారం.. ప్రసాదంలో నత్త అవశేషాలు
Advertisement

ప్రసాదంలో నత్త ఉన్నట్లుగా భావించిన దంపతులు వెంటనే ఫోటోలు, వీడియోలు తీసి భద్రపరిచారు. అనంతరం ప్రసాదం కౌంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా, అక్కడి సిబ్బంది సరైన స్పందన ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. నత్త ఉన్న ప్రసాదం ప్యాకెట్‌ను తీసుకుని మరో ప్యాకెట్ ఇచ్చి వెళ్లిపోవాలని మాత్రమే చెప్పారని, తాము ఎదుర్కొన్న పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. ప్రసాదం అనేది భక్తులకు పవిత్రమైనదని, అందులో ఇటువంటి అంశాలు కనిపించడమేంటని పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ వివాదంపై భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు స్పందించారు. పులిహోర ప్రసాదంలో నత్త అంశంపై ఆలయ ఈఓను వివరణ కోరినట్లు ఆయన తెలిపారు. ఈవో ఇచ్చిన వివరాల ప్రకారం, ఆ దంపతులు యూట్యూబర్లు అని, ప్రసాదం కౌంటర్ వద్ద సరైన స్పందన రాలేదన్న కారణంతో కావాలనే ఈ వ్యవహారం చేశారన్న ఆరోపణ ఉంది. సిబ్బందితో వాగ్వాదం జరిగిన తర్వాత నేను ఇలా చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి, ఆపై ప్రసాదంలో నత్త అవశేషాలు పెట్టి వీడియో తీసినట్లు ఈవో పేర్కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

ఈవో వివరణలో మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. నిజంగా ప్రసాదం తయారీ సమయంలో నత్త ఉంటే, అది వేరే స్థితిలో కనిపిస్తుందని, ప్రసాదం పూర్తయ్యాక బయట నుంచి ఉంచితే వేరేలా ఉంటుందని వివరించినట్లు తెలిపారు. ఈ ఘటనపై యూట్యూబర్‌ను ప్రశ్నించగా, ప్రసాదం కౌంటర్ వద్ద తనను సరిగ్గా పట్టించుకోలేదన్న కోపంతోనే వీడియో చేశానని అతడు చెప్పినట్లు ఈవో వెల్లడించారు.

అంతేకాదు, వీడియోను డిలీట్ చేశానని, ముక్కోటి ఏకాదశి దర్శనానికి కూడా వస్తానని, తనను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా యూట్యూబర్ చెప్పినట్లు ఈవో వివరించారు. అయితే ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. యూట్యూబర్ కావాలనే ఇలా చేసి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈవోకు సూచించారు. అదే సమయంలో, నిజంగా ప్రసాదంలో పొరపాటు జరిగి ఉంటే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Also Read: ఏపీకి న్యూఇయర్ గిఫ్ట్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం, ముహూర్తం రెడీ

ఈ ఘటన భక్తుల మనోభావాలకు సంబంధించినదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సింహాచలం వంటి ప్రసిద్ధ ఆలయాల్లో ప్రసాదం విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద వివాదాలకు దారి తీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం జరిగితే.. ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×