E-Paper
Advertisement

Sharmila : క్రైస్తవ వ్యతిరేకి జగన్.. మణిపూర్ విధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదు..?

Sharmila : ఏపీలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వైఎస్‌ షర్మిల తన అన్న సోదరుడు సీఎం జగన్‌ను టార్గెట్‌ చేశారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిసారే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో మణిపూర్‌ ఘటనపై స్పందించిన షర్మిల.. జగన్‌ క్రైస్తవుడంటూ నొక్కి మరీ చెప్పారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Sharmila : క్రైస్తవ వ్యతిరేకి జగన్.. మణిపూర్ విధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదు..?
Advertisement
AP Politics

YS Sharmila congress news(AP politics):

ఏపీలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వైఎస్‌ షర్మిల తన అన్న సోదరుడు సీఎం జగన్‌ను టార్గెట్‌ చేశారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిసారే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో మణిపూర్‌ ఘటనపై స్పందించిన షర్మిల.. జగన్‌ క్రైస్తవుడంటూ నొక్కి మరీ చెప్పారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకుసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె అన్న సీఎం జగన్‌తోపాటు.. టీడీపీ, బీజేపీలను టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే,.. ఈ సందర్భంగా మత ప్రస్తావన తీసుకువచ్చారు షర్మిల. జగన్‌ క్రైస్తవుడై ఉండి… మణిపూర్‌లో విధ్వంస ఘటనపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

Advertisement

మణిపూర్ రాష్ట్రంలో 2 వేల చర్చిలను ధ్వంసం చేసినా.. 60 వేల మంది నిర్వాసితులయినా ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. క్రైస్తవుల కడుపు మండిపోతుంటే సాటి క్రిస్టియన్‌ అయి ఉండి నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తొత్తు కాబట్టే సైలెంట్‌ అయ్యారని విమర్శించారు. అయితే,.. ఈ వ్యాఖ్యల వెనుక ఓటు రాజకీయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్టియన్ల ఓటు బ్యాంకింగ్‌ను తన వైపుకి తిప్పుకునేందుకే మణిపూర్‌ ఘటన, జగన్‌పై మత ప్రస్తావన తీసుకువచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×