E-Paper
Advertisement

Anganwadi : అర్థరాత్రి ఉద్రిక్తత.. అంగన్ వాడీల దీక్షకు భగ్నం ..

Anganwadi : విజయవాడ ధర్నాచౌక్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. 42 రోజులుగా వేతనాల పెంపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించిన వైసీపీ సర్కారు.. తాజాగా వారి దీక్షలను కూడా భగ్నం చేసింది. దీంతో అర్ధరాత్రి ధర్నా చౌక్ లోని అంగన్ వాడీల టెంట్లను పోలీసులు పీకేశారు. తమ దీక్ష భగ్నం చేయడంతో అంగన్ వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంగన్ వాడీలను అదుపులోకి తీసుకుంటున్నారు. అటు.. విధులకు హాజరు కాని అంగన్ వాడీలను తొలగించాలని పలు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు కూడా సిద్ధం చేస్తున్నారు.

Anganwadi : అర్థరాత్రి ఉద్రిక్తత.. అంగన్ వాడీల దీక్షకు భగ్నం ..
Advertisement
Anganwadi strike in ap latest news

Anganwadi strike in ap latest news(AP news live):

విజయవాడ ధర్నాచౌక్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. 42 రోజులుగా వేతనాల పెంపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించిన వైసీపీ సర్కారు.. తాజాగా వారి దీక్షలను కూడా భగ్నం చేసింది. దీంతో అర్ధరాత్రి ధర్నా చౌక్ లోని అంగన్ వాడీల టెంట్లను పోలీసులు పీకేశారు. తమ దీక్ష భగ్నం చేయడంతో అంగన్ వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంగన్ వాడీలను అదుపులోకి తీసుకుంటున్నారు. అటు.. విధులకు హాజరు కాని అంగన్ వాడీలను తొలగించాలని పలు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు కూడా సిద్ధం చేస్తున్నారు.

తిరుపతిలోనూ అంగన్ వాడీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఛలో విజయవాడకు బయల్దేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 40 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేయగా, వారు స్టేషన్‌లోనే నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా నుంచి రెండు బస్సుల్లో బయలుదేరిన అంగన్‌వాడీలను కావలి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులను కావలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్దకు ఆదివారం రాత్రే అంగన్‌వాడీలు భారీగా చేరుకుని నిద్రించారు. అక్కడి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు.

Advertisement

ఏపీవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్‌కు ఇచ్చేందుకు తరలిరావాలని అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపట్టనున్నట్లు సమాచారం. మొదట విజయనగరం, ప్రకాశం, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల జిల్లాల కార్యకర్తలు, ఆయాలు.. సోమవారం విజయవాడకు చేరుకునేలా ప్రణాళిక రచించారు. మిగతా జిల్లాల వారు.. మంగళవారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన కార్యకర్తలు, ఆయాలను పలుచోట్ల బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అదుపులోకి తీసుకుంటున్నారు.

.

Advertisement

.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×