// // Nara Lokesh AI video: ఏపీకి ఎవ‌రుస్తున్నారో చెప్పుకోండి.. నారా లోకేష్ ఏఐ వీడియో వైరల్ -->
E-Paper
Advertisement

ఏపీకి ఎవ‌రుస్తున్నారో చెప్పుకోండి.. నారా లోకేష్ ఏఐ వీడియో వైరల్

ఏపీకి ఎవ‌రుస్తున్నారో చెప్పుకోండి.. నారా లోకేష్ ఏఐ వీడియో వైరల్
Advertisement

Nara Lokesh AI video: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ తన మొట్టమొదటి భారీ తయారీ కేంద్రాన్ని తమిళనాడు వెలుపల.. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని (ప్రస్తుత తిరుపతి జిల్లా) సత్యవేడులో సుమారు రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్టులలో ఇది ఒకటి కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఈ భారీ పెట్టుబడిని స్వాగతిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఒక వినూత్నమైన ఏఐ (AI) జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను నడుపుతూ కనిపించి నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా మార్చే దిశగా ఇది కీలక పరిణామమని ప్రభుత్వం భావిస్తోంది. లోకేష్ తన పోస్ట్‌లో కంపెనీ పెట్టుబడిని ధృవీకరిస్తూ.. “త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వీధుల్లో ఈ గంభీరమైన ఇంజిన్ శబ్దాలు మారుమోగనున్నాయి.” అని పేర్కొన్నారు.

Advertisement

ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం సుమారు 267 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో కేవలం తయారీ యూనిట్ మాత్రమే కాకుండా.. విడిభాగాల తయారీదారుల కోసం ప్రత్యేకంగా ‘వెండర్ పార్క్’ కూడా ఉండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ రెండు దశల్లో పూర్తి కానుంది. మొదటి దశను 2029 నాటికి.. రెండో దశను 2032 నాటికి పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏటా 9 లక్షల అదనపు యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు.. సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభించనుంది.

Advertisement

Read Also: తమిళ రాజకీయంలో ‘దళపతి’ మార్క్ వ్యూహం.. సొంత మీడియా వైపు విజయ్ అడుగులు?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×