// // Roja Warning to Chandrababu: మాకు సంస్కారం ఉంది.. అందుకే ఆగుతున్నాం, లేకుంటే సీఎం, డిప్యూటీ సీఎం రోడ్లపైకి రారు: రోజా -->
E-Paper
Advertisement

మాకు సంస్కారం ఉంది.. అందుకే ఆగుతున్నాం, లేకుంటే సీఎం, డిప్యూటీ సీఎం రోడ్లపైకి రారు: రోజా

మాకు సంస్కారం ఉంది.. అందుకే ఆగుతున్నాం, లేకుంటే సీఎం, డిప్యూటీ సీఎం రోడ్లపైకి రారు: రోజా
Advertisement

Roja Warning to Chandrababu: వైఎస్సార్‌సీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై నిప్పులు చెరిగారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక బ్రోకర్లా వ్యవహరిస్తూ వేల కోట్లు గడించారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు రాతలు రాస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆ పత్రిక కార్యాలయాలను తగలబెడతామని ఆమె సంచలన హెచ్చరికలు జారీ చేశారు. తాము సంస్కారంతో మౌనంగా ఉంటున్నామని, ఒకవేళ తాము నోరు తెరిస్తే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ప్రస్తుత మంత్రులు రాష్ట్రంలో రోడ్లపై తిరగలేరని ఆమె స్పష్టం చేశారు.

రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి నగరంలో వైఎస్సార్‌సీపీ నేతలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి ఆర్కే రోజా.. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను రోడ్డుపై వేసి దహనం చేశారు. ఈ క్రమంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

ఈ సందర్భంగా రోజా కేవలం రాధాకృష్ణపైనే కాకుండా చంద్రబాబు ప్రభుత్వంపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి మరోసారి వెన్నుపోటు పొడిచారని ఆమె ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్న ప్రభుత్వం, అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తోందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆమె విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో 87 శాతం పనులు పూర్తయిన రాయలసీమ ప్రాజెక్టును నిలిపివేయడం ఈ ప్రాంత ప్రజల గొంతు కోయడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయించుకోవడానికి రాయలసీమ ప్రజలు ‘మహా ఉద్యమం’ చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Read Also: సామాన్యుడికి సైతం పోలీసుల ప్రోటోకాల్.. వలిగొండలో అరుదైన ఘటన!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×