E-Paper
Advertisement

తెలంగాణ బీజేపీ ఎంపీల పై కల్వకుంట్ల కవిత ఫైర్!

తెలంగాణ బీజేపీ ఎంపీల పై కల్వకుంట్ల కవిత ఫైర్!
Advertisement

Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల మీద కక్ష గట్టినట్లు వ్యవహరిస్తూ వారి నోటి కాడి కూడు లాగేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి పని దినాలు తగ్గించటం, నిధులు ఇవ్వకపోవటంపై మోడీ సర్కార్ ను గట్టిగా నిలదీస్తూ వీడియో సందేశం రిలీజ్ చేశారు.

ఉపాధి హామీ పథకానికి..

పేదలకు మేలు చేసే ఉద్దేశంతో తెచ్చుకున్న ఉపాధి హామీ పథకాన్ని పథకం ప్రకారం తొలగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి చట్టబద్దత లేకుండా చేశారని మండిపడ్డారు. చట్టబద్ధత ఉంటే నిధులు ఇవ్వడం తప్పనిసరి అవుతుందని కానీ ఈ పథకాన్ని ఒక ప్రొగ్రామ్ గా మార్చేసి నిధులు ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు. భవిష్యత్ లో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన కూడా అడిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also read: సామాన్యుడికి సైతం పోలీసుల ప్రోటోకాల్.. వలిగొండలో అరుదైన ఘటన!

తెలంగాణలో కొవిడ్ తర్వాత..

ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత మెరుగుపడిందన్నారు. ఈ పథకం పని దినాలను తగ్గించటం, నిధులు ఇవ్వకుండా చేయటం ద్వారా గ్రామాల్లో పేదల కడుపు కొడుతున్నారన్నారు. తెలంగాణలో కొవిడ్ తర్వాత 2021-22 లో 14 కోట్ల పని దినాలు ఉంటే గతేడాది 7 కోట్లకు పని దినాలను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఉపాధి హామీలో పని దినాలు కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారన్నారు.

అమలు చేయాలని డిమాండ్..

Advertisement

వారికి ఉద్యోగ భద్రతతో, కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే..వారు ప్రజల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేదల నోటికాడి కూడు లాగేస్తుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అన్యాయమన్నారు. తక్షణమే కేంద్రంలోని వారి ప్రభుత్వంతో కొట్లాడి ఉపాధి హామీకి రావాల్సిన నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరువు కాలంలో గ్రామాల్లో పేదలను ఆదుకున్న ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

Also Read: వేసవిలో కూడా పెరటి తోట పచ్చగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×