E-Paper
Advertisement

VYOOHAM: ‘వ్యూహం’లో వైఎస్ భారతి.. షాకింగ్ సీన్స్..

VYOOHAM: ‘వ్యూహం’లో వైఎస్ భారతి.. షాకింగ్ సీన్స్..
Advertisement
_jagan bharati vyooham

RGV VYOOHAM Movie Updates: వర్మ వేలు పెట్టాడంటే.. అది రచ్చ రచ్చ అవ్వాల్సిందే. అందులోనూ ఆయన పొలిటికల్ సినిమా తీస్తున్నాడంటే.. ఇక రచ్చో రచ్చస్య రచ్చోభ్య:. అట్లుంటది ఆర్జీవీతోని.

గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌, కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. అంటూ రాజకీయంగా కలకలం రేపారు. చంద్రబాబు టార్గెట్‌గా సినిమాలు తీశారు. ఇప్పుడు జగన్‌కు ఫేవర్‌గా ‘వ్యూహం’ స్టార్ట్ చేశారు. అసలే వర్మ. ఏం తీస్తాడో? ఎవరిని హీరోని చేస్తారో? ఇంకెవరిని విలన్‌గా ప్రొజెక్ట్ చేస్తారోననే టెన్షన్ ఉండనే ఉంటుంది.

Advertisement

లేటెస్ట్‌గా ఆయన వ్యూహం మూవీకి సంబంధించిన కొన్ని క్లిక్స్ వదిలారు. ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోస్ అప్పుడే పొలిటికల్ ప్రకంపణలు రేపుతోంది. సినిమా.. వైఎస్ భారతి సెంట్రిక్‌గా తీశారా? అనే అనుమానమూ కలుగుతోంది.

బెడ్‌రూమ్‌లో.. జగన్‌ టెన్షన్ పడుతూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు ఓ ఫోటోలో ఉంది. పక్కనే భారతి సైతం అంతే హైరానాతో కనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ ఫోన్ కాల్ ఏంటి? ఎవరి నుంచి వచ్చింది? ఏ విషయం గురించై ఉంటుంది? వివేకా మర్డర్ గురించి అవినాష్‌రెడ్డి చెప్పే సందర్భంలోనిదా? ఇలా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Advertisement

ఇక మరో ఫోటో అంతుచిక్కకుండా ఉంది. జగన్ సీరియస్‌గా సోఫాలో కూర్చొని ఉండి.. తల పక్కకు తిప్పుకొని ఉంటారు. బ్యాగు, ఫైలు పట్టుకున్న ఓ వ్యక్తిని జగన్ మనుషులు లాగేస్తుంటారు. ఆ పక్కనే ఇదంతా చూస్తూ కనిపిస్తారు భారతి. ఈ సీన్ దేనిగురించై ఉంటుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వ్యాపారి గెటప్‌లో ఉన్న ఆ పర్సన్ ఎవరై ఉంటారాబ్బా? అంటూ మెదడుకు పదును పెడుతున్నారు. ఇలా పలు కీలక ఘట్టాలనే వ్యూహంలో చూపించబోతున్నట్టున్నారు ఆర్జీవీ.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×