E-Paper
Advertisement

Droupadi Murmu : తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..

Droupadi Murmu : తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..
Advertisement

Droupadi Murmu : తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేసిన రాష్ట్రపతి.. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. తొలుత వరాహ స్వామిని.. అనంతరం శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ద్రౌపదీ ముర్ముకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు.

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శ్రీవారి చిత్రపటం, స్వామివారి తీర్థప్రసాదాలను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతితోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, కొట్టు సత్యనారాయణ శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో రాష్ట్రపతి భేటీ ఉంది. తిరుపతిలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి డిల్లీకి పయనమవుతారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో రెండురోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన నేవీ డేకి హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 28న శీతాకాల విడిది కోసం తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×