E-Paper
Advertisement

Modi : పోలింగ్ బూత్ కు క్యూలైన్ లో ప్రధాని.. అహ్మదాబాద్ లో ఓటేసిన మోదీ..

Modi : పోలింగ్ బూత్ కు క్యూలైన్ లో ప్రధాని.. అహ్మదాబాద్ లో ఓటేసిన మోదీ..
Advertisement

Modi : గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రాణిప్‌లోని పోలింగ్‌ బూత్ కు క్యూలైన్‌లో వెళ్లి మోదీ ఓటేశారు. ప్రధాని ఈ ఉదయం గాంధీనగర్‌ రాజ్‌భవన్‌ నుంచి అహ్మదాబాద్‌ చేరుకున్నారు. రాణిప్‌లోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు వచ్చిన మోదీ.. కాన్వాయ్‌ను కొంతదూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోదీ ట్విటర్‌ ద్వారా పిలుపునిచ్చారు.


గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శైలజ్‌ అనుపమ్‌ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సీఎం పటేల్‌ కూడా క్యూలైన్‌లోనే వెళ్లి ఓటు వేశారు. గుజరాత్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా దంపతులు అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్ లోనే ఓటేశారు.

Advertisement

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం, 11 గంటలకు 19.17 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రెండో విడతలో 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.51 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. డిసెంబర్ 8న గుజరాత్‌తోపాటు హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×