E-Paper
Advertisement

Train Derailment: ప్రకాశం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. జస్ట్ మిస్ లేకపోతే

Train Derailment: ప్రకాశం జిల్లాలో  పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్..   జస్ట్ మిస్ లేకపోతే
Advertisement

Train Derailment: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం (జనవరి 30) తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ – చెన్నై ప్రధాన రైలు మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన రెండు బోగీలు పక్కనే ఉన్న రెండు రైల్వే లైన్లపై పడిపోవడంతో ట్రాక్ దెబ్బతిన్నది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ప్రమాద వార్త తెలిసిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు మరియు సాంకేతిక సిబ్బంది భారీ క్రేన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలపై పడిపోయిన బోగీలను తొలగించి, దెబ్బతిన్న ట్రాక్‌కు మరమ్మతులు చేసే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అయితే, పునరుద్ధరణ పనుల కారణంగా పలు ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి, మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి, ట్రాక్ భద్రతను నిర్ధారించిన తర్వాతే రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Read Also: Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×