// // Diabetes Control Foods: ఈ ఐదు కూరగాయలతో డయాబెటిస్‌కు చెక్! -->
E-Paper
Advertisement

Diabetes Control Foods: షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే.. మీ డైట్‌లో ఈ 5 కూరగాయలు ఉండాల్సిందే!

Diabetes Control Foods: షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే.. మీ డైట్‌లో ఈ 5 కూరగాయలు ఉండాల్సిందే!
Advertisement

Diabetes Control Foods: ప్రస్తుతం చాలామందిలో చక్కెర స్థాయిలు పెరగడం అనేది ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే సరైన ఆహార నియమాలు పాటిస్తే డయాబెటిస్‌ను నియంత్రించడం పెద్ద కష్టమేమీ కాదు. మనం తీసుకునే ఆహారమే మనకు మొదటి మందు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కూరగాయల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. షుగర్ లెవల్స్‌ను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి, పీచు పదార్థం ఎక్కువగా ఉండే కొన్ని కూరగాయలు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయో ఇప్పుడు చూద్దాం.

కాకరకాయతో ఇన్సులిన్ ఉత్పత్తి:

చాలామంది కాకరకాయ అనగానే చేదుగా ఉంటుందని దూరం పెడుతుంటారు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదొక వరం లాంటిది. దీనిలో ఉండే ప్రత్యేక సమ్మేళనాలు మన శరీరంలో సహజ ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను వేగంగా తగ్గించడంలో కారకాయకు సాటి మరొకటి లేదు. ఇది కేవలం కూరగానే కాకుండా.. ఉదయాన్నే ఓ గ్లాసు కాకరకాయ రసం తాగిడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయి.

Advertisement

Also Read: నీరసం, అలసట మాయం.. శరీరంలో రక్తాన్ని పెంచే నేచురల్ డ్రింక్స్!

ఆకుకూరలతో ఆరోగ్యం:

మెంతి కూర, పాలకూర వంటి ఆకుకూరలు డయాబెటిస్‌ను నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ మనం తిన్న ఆహారం నుంచి చక్కెరను శరీరం నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. దీంతో రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. మెంతులను కూరల్లో వాడటమే కాకుండా.. పప్పులో కలిపి వండుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యమూ లభిస్తుంది.

సొరకాయతో డీహైడ్రేషన్‌కు చెక్:

Advertisement

సొరకాయలో దాదాపు 90 శాతం నీరే ఉంటుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. షుగర్ పేషెంట్లు తరచుగా ఎదుర్కొనే డీహైడ్రేషన్ సమస్యను ఇది అరికడుతుంది. అంతేకాదు.. బరువు తగ్గేందుకు కూడా సొరకాయ బెస్ట్ ఛాయిస్. జ్యూస్లే దా పప్పుతో కలిపి తీసుకుంటే మంచిది.

చక్కెరను కంట్రోల్ చేసే బెండకాయ:

బెండకాయలో ఉండే జిగురు పదార్థం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీనిలోని ఫైబర్ రక్తంలో చక్కెర నిల్వలను స్థిరంగా ఉంచుతుంది. కొందరు బెండకాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తాగడం అనేది పాతకాలపు చిట్కా అయినప్పటికీ.. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

సర్వరోగ నివారిణి మునక్కాయ:

మునక్కాయ, మునగ ఆకులు మధుమేహానికి మాత్రమే కాకుండా, రక్తపోటును తగ్గించడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే గుణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. మునగను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్లోమ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఇది మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Also Read: మందారం పువ్వులను పూజకే కాదు.. ఇలా వాడితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×