E-Paper
Advertisement

Mp Avinash Reddy: సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు.. ఎంపీ అవినాష్‌ పీఏ ఇంటికి పోలీసులు!

Mp Avinash Reddy: సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు.. ఎంపీ అవినాష్‌ పీఏ ఇంటికి పోలీసులు!
Advertisement

Mp Avinash Reddy:  ఏపీ స‌ర్కార్ సోష‌ల్ మీడియా అరాచకాల‌పై నిఘా పెట్టిన సంగ‌తి తెలిసిందే. నెట్టింట అస‌త్య ప్ర‌చారం, వ్య‌క్తిగ‌త దూష‌ణలు చేసిన వారిపై చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే కొంత మందిని గుర్తించ‌డంతో పాటు అదుపులోకి తీసుకుంది. ఏకంగా మూడు వంద‌ల మంది సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌వారు ముందుగానే లొంగిపోయేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. అదే విధంగా దాదాపు 2వేల మంది ఆకతాయిల‌ను పోలీసులు ఇప్ప‌టికే గుర్తించిన‌ట్టు తెలుస్తోంది.

Also read:కుప్పంలో వైసీపీ ఖాళీ.. టీడీపీలోకి కీలక నేతలు

Advertisement

మ‌రోవైపు న‌టి, వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌కర్త శ్రీరెడ్డి ఇప్ప‌టికే బ‌యట‌కు వ‌చ్చి ఓ వీడియోను విడుద‌ల చేసింది. త‌న‌ను వ‌దిలిపెట్టాల‌ని వేడుకుంది. ఇక‌ పోలీసులు తాము గుర్తించిన వారిని ఒక్కొక్క‌రిగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు గానూ వైసీపీ ఎంపీ అవినాష్ పీఏ రాఘ‌వ ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. కానీ రాఘ‌వ ఇంట్లో నుండి ప‌రార్ అయిన‌ట్టు తెలుస్తోంది.

పోలీసులు రాఘ‌వ తండ్రిని ప్ర‌శ్నించగా ఇంట్లో లేడ‌ని వ‌చ్చిన త‌ర‌వాత స‌మాచారం ఇస్తామ‌ని స‌మాధానం ఇచ్చారు. ఆయ‌న లాయర్ పోలీసులకు ప‌రిస్థితి వివ‌రించ‌డంతో ఇంటి నుండి వెళ్లిపోయారు. రాఘ‌వ వైఎస్ భార‌తి, వ‌ర్ర ర‌వీంద్ర‌ల‌తో చాటింగ్ చేసిన‌ట్టు పోలీసులు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. రాఘ‌వను అదుపులోకి తీసుకుంటే ఈ విష‌యంపై కూడా విచార‌ణ జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు పోలీసుల అదుపులో ఉన్న బోరుగ‌డ్డ అనిల్ ను క‌ర్నూలుకు తీసుకువ‌చ్చారు. పీటీ వారెంట్ పై క‌ర్నూలు తీసుకురాగా.. చంద్ర‌బాబు, లోకేష్ ల‌కు వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టినందుకు కేసులు న‌మొదు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×