E-Paper
Advertisement

Malla Reddy: చిక్కుల్లో మల్లారెడ్డి.. బయటపడ్డ మరో బాగోతం

Malla Reddy: చిక్కుల్లో మల్లారెడ్డి.. బయటపడ్డ మరో బాగోతం
Advertisement

Malla Reddy: పీజీ మెడికల్‌ సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో సమస్య ఎదురైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ స్థలంలోని ఐదెకరాలు తమకు చెందినవంటూ బాధితులు తెరపైకి వచ్చారు. స్థలాన్ని కొలిచేందుకు సర్వేయర్లు, అడ్వకేట్‌తో వచ్చిన బాధితులను స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వారికి కోర్టు ఆదేశాలు ఇస్తేనే స్థలాన్ని కొలవనిస్తామంటూ స్థానికులు తేల్చి చెప్పారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

బహదూర్ పల్లికి చెందిన పిట్ల వీరయ్య అనే వ్యక్తికి 641, 642, 643, 644 సర్వే నెంబర్‌లలో ఏడెకరాల తొమ్మిది గుంటల స్థలం ఉండేదని బాధితులు తెలిపారు. పిట్ల వీరయ్యకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఓ కొడుకు ఉన్నారని చెప్పారు. ఏడెకరాల తొమ్మిది గుంటల స్థలాన్ని ముగ్గురు కొడుకులు సమానంగా పంచుకోవాలని వీలునామా సైతం రాసుకున్నారని.. అయితే 1970లో 641 సర్వే నెంబర్‌లోని రెండెకరాలను మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డికి పిట్ల వీరయ్య మొదటి భార్య కొడుకులు పిట్ల చంద్రయ్య, పిట్ల నరసింహులు అమ్మేసినట్టు వివరించారు.

Advertisement

అయితే 642, 643, 644 సర్వే నెంబర్‌లలో ఉన్న మిగతా ఐదెకరాలను కూడా మల్లారెడ్డి కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేశామని, సర్వే చేయించుకొని ఎవరి స్థలాన్ని వారు తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు సైతం ఇచ్చిందని బాధితుడు పిట్ల యాదగిరి తరఫు అడ్వకేట్ రమణ తెలిపారు.ఇరు వర్గాల వారికి కోర్టు ఆర్డర్స్ ఇస్తేనే సర్వే చేసేందుకు అనుమతి ఇస్తామంటూ స్థానికులు బాధితులను అడ్డుకున్నారు. ఒక వర్గానికే కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం వల్లే సర్వేను అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.దీంతో కోర్టు ఆర్డర్‌తోనే మళ్లీ వచ్చి సర్వే చేస్తామని బాధితులు స్పష్టం చేశారు.

Also Read: నేడు మ‌హ‌రాష్ట్ర‌కు రేవంత్.. జార్ఖండ్ కు భ‌ట్టి.. ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే!

Advertisement

మొత్తంగా ఓ పక్క ఈడీ నోటీసులు.. మరోపక్క మల్లారెడ్డి యూనివర్సిటీలో తమకు ఐదెకరాల స్థలం ఉందంటూ బాధితులు ఆందోళనకు దిగడంతో మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×