E-Paper
Advertisement

కాసేపట్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. మోడీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకతలు ఇవే!

కాసేపట్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. మోడీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Bhogapuram Airport: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కానుంది. అందుకు గాను నేడు ఉదయం 9.15 గంటలకు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. అక్కడ 10.45 గంటలకు ప్రధానికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గోననున్నారు.

ప్రధానికి ఘన స్వాగతం..

ముందుగా 10.58 గంటలకు ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యం థింసాతో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఎర్పాట్లను చేసింది. ఏక రూప దుస్తులతో నిర్వహించిన రిహార్సల్‌కు అతిపెద్ద థింసా నృత్యంగా ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని చుట్టూ ప్రభుత్వం ఎర్పాట్లు చేసింది.

Advertisement

Also Read: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ ధరలు భారీగా తగ్గింపు!

ఏటికొప్పాక కళాకృతి..

విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా భారీ స్థాయి ఏటికొప్పాక కళాకృతిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విమానాశ్రయ ప్రాంగణం లోపల ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి అద్దం పట్టేలా తొలు బొమ్మలు, బొబ్బిలి వీణ, నాద స్వరం, లేపాక్షి నంది చిత్రాలతో పాటు భౌగోళిక వారసత్వాన్ని చాటే బంగినపల్లి మామిడి లాంటి చిత్రాల అలంకరణను చేశారు. విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం 12 నిముషాల పాటు ఏపీ సాంస్కృతిక వైభవాన్ని ప్రధాని మోదీ తిలకించనున్నారు. అనంతరం బహిరంగ సభకు హాజరై మాట్లాడనున్నారు.

Advertisement

Also Read: జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×