E-Paper
Advertisement

Yatra 2: ఏపీలో పొలిటికల్ బయోపిక్స్ సందడి.. ‘యాత్ర -2’ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..

Yatra 2: ఏపీలో పొలిటికల్ బయోపిక్స్ సందడి.. ‘యాత్ర -2’ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..
Advertisement

Yatra 2: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు జీవిత కథాంశాలతో చిత్రాలు రాబోతున్నాయి. 2024 ఎన్నికల కోసం ఇప్పటికే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. వ్యూహంతో సిద్ధం చేస్తుండగా.. ఇప్పడు మరో మూవీ యాత్ర -2 సిద్ధమవుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌ యాత్ర. ఈ మూవీ పెద్ద సక్సెస్ అందుకుంది. ఆ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించి హిట్ కొట్టారు. ఇప్పుడు ఆయన యాత్ర -2 పేరుతో మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు.

Advertisement

‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..’ అంటూ జగన్ చెయ్యెత్తి ప్రజలకు అభివాదం చేస్తున్నట్లు పోస్టర్ ఉంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వై.ఎస్.ఆర్. పాత్రలో అద్భుతంగా నటించి అందరి మెప్పు అందుకున్నారు. ఇక దానికి సీక్వెల్ గా రానున్న యాత్ర- 2లో జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఈ సినిమాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గా తమిళ యువ హీరో జీవా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ – కే స్వరాలందిస్తున్న సంతోష్ నారాయణన్ యాత్ర 2 పని చేయనుండగా.. శివ మీకా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×