E-Paper
Advertisement

ఆర్టీసీని నడపడం చేతకాకపోతే మాకివ్వండి.. కూటమికి పేర్ని నాని సవాల్!

ఆర్టీసీని నడపడం చేతకాకపోతే మాకివ్వండి.. కూటమికి పేర్ని నాని సవాల్!
Advertisement

Perni Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రెండేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో సీఎం కాకపోయి ఉంటే, చంద్రబాబు అప్పుడే ఆర్టీసీని అమ్మేసేవారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ అదే బాటలో ఉచిత బస్సు ప్రయాణాన్ని సాకుగా చూపిస్తూ ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పుడు, దానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం ఆర్టీసీకి ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

పేర్ని నాని సవాల్

Advertisement

ఆర్టీసీని నడపడం చేతకాకపోతే వైసీపీకి అప్పగించాలని, తాము సమర్థవంతంగా నడిపి చూపిస్తామని సవాల్ విసిరారు. గత జగన్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకుంటే, నేడు చంద్రబాబు వారిని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం ఈ-బస్ సేవా కింద తెస్తున్న బస్సుల నిర్వహణ ఖర్చులపై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, కిలోమీటరుకు అయ్యే అసలు వ్యయాన్ని దాచిపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ధనిక రాష్ట్రం చేస్తానంటూ ప్రగల్భాలు పలికారని, కానీ 24 నెలల్లోనే రాష్ట్రాన్ని నేరాలు, నిరుద్యోగంలో దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్లారని ఆరోపించారు. రాష్ట్ర సంపద సృష్టి అంతా కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అనే ‘త్రిమూర్తుల’ సొంత మనుషులకు, బ్రోకర్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

పవన్ వ్యాఖ్యలకు పేర్ని కౌంటర్

Advertisement

ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ గెలిచిన 11 సీట్లపై సెటైర్లు వేసే పవన్, గతంలో 175 స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఇంకా తాను ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని, అధికారంలోకి వచ్చినా జనసేన కార్యకర్తలకు దక్కింది తన్నులు, కేసులు మాత్రమేనని అన్నారు. బందరులో జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేస్తుంటే స్థానిక మంత్రిని ప్రశ్నించే ధైర్యం కూడా పవన్‌కు లేదని విమర్శించారు. 100 శాతం స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్న పవన్ గెలిపించిన ఎమ్మెల్యేలలో ఒక్కడైనా జనసేన జెండా మోసిన వాడు ఉన్నాడా అని నిలదీశారు. రాష్ట్రంలో అబ్బాయి దోచుకుంటుంటే, డాడీ విదేశాల్లో దాస్తున్నారని.. రాబోయే మూడేళ్లు రాష్ట్రాన్ని పాలించే అర్హత చంద్రబాబుకు లేదని, వెంటనే ఆయన తప్పుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Also Read:మండుతున్న పెట్రో ధరలు.. ఈ 5 బైక్‌ లు మీ ఖర్చు తగ్గించేస్తాయి!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×