E-Paper
Advertisement

PDS Rice Missing Case: రేషన్ బియ్యం కేసు.. విచారణలో పేర్నినాని వైఫ్, ఆపై కీలక విషయాలు

PDS Rice Missing Case: రేషన్ బియ్యం కేసు.. విచారణలో పేర్నినాని వైఫ్, ఆపై కీలక విషయాలు
Advertisement

PDS Rice Missing Case: రేషన్ బియ్యం మాయం కేసు విచారణ ఎంత వరకు వచ్చింది? కేసు విచారణ ఓ అడుగు ముందుకు పడిందా? సినిమా డైలాగ్స్ రిపీట్ అవుతున్నాయా? విచారణలో పేర్ని నాని వైఫ్ సమాధానాలు చూసి పోలీసులే షాకయ్యారా? అసలేం జరిగింది. ఒక్కసారి లోతుల్లోకి వెళ్దాం.

వైసీపీ నేతలు ఏ పని చేసినా తెలివిగా, జాగ్రత్తగా చెస్తారనే ప్రచారం ఉంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు నేతలు. కొందరి నేతలపై అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని కూటమి సర్కార్ బయటపెడుతోంది. అందులో ఒకటి రేషన్ బియ్యం మాయం కేసు.

Advertisement

ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇందులో A1గా మాజీ మంత్రి పేర్నినాని భార్య జయసుధ పేరు చేర్చారు. విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో బుధవారం బందరు పోలీసుస్టేషన్‌లో తన లాయర్లతో కలిసి విచారణకు హాజరయ్యారు జయసుధ.

మొత్తం అధికారులు 45 ప్రశ్నలు సంధించారట పోలీసులు. అందులో చాలా ప్రశ్నలకు తనకు తెలీదు.. మరిచిపోయాను.. గుర్తు లేదు అనే జవాబులే ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. నిందితురాలు చెబుతున్న సమాధానాలు విన్న పోలీసులకు చెమటలు పట్టాయని అంటున్నారు. దేనికీ కరెక్టుగా సమాధానం రాలేదట.

Advertisement

ALSO READ:  ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? రేసులో వారు, కాకపోతే

ఈ క్రమంలో అదుర్స్ మూవీ ఎన్నిసార్లు చూశారో తెలీదుగానీ, అందులో విలన్-ఎన్టీఆర్ మధ్య సంభాషలను గుర్తు చేసుకున్నారు పోలీసులు. తెలీదు.. గుర్తు లేదు.. మరిచిపోయాను ఆ మూడు డైలాగులు పదేపదే రిపీట్ అయ్యాయని తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమా నిర్మాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

గొడౌన్ నిర్మాణం ఎప్పుడు చేశారు.. ఎలా చేశారు? ఎవరి పేరు మీద ఉంది? ప్రభుత్వానికి ఎప్పుడు ఎంత అద్దె చెల్లించారు? బియ్యం నిల్వలను మీరు చూశారా? గొడౌన్ నగదు లావాదేవీలు చూసిందెవరు? ఈ మధ్యకాలంలో ఎంత చెల్లించారు? రైస్ ఎక్కువగా స్టోరేజ్ చేయడానికి కారణాలేంటి? ఇలాంటి దాదాపు 45 ప్రశ్నలు సంధించారట.

తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గోడౌన్ మేనేజర్ ఈ వ్యవహారాలను చూసుకునేవారని చెప్పారట జయసుధ. తనకు తెలీకుండా బియ్యం పక్కదాని పట్టించారంటూ మేనేజర్‌పై నెట్టేసినట్టు తెలుస్తోంది. విచారణకు మరోసారి అవసమైతే పిలుస్తామని పోలీసులు చెప్పారట. విచారణ తర్వాత అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×