E-Paper
Advertisement

Fire Accident: జేసీ దివాకర్ రెడ్డి బస్సులు కాలిపోయినయ్.. కావాలనే చేశారా..?

Fire Accident: జేసీ దివాకర్ రెడ్డి బస్సులు కాలిపోయినయ్.. కావాలనే చేశారా..?
Advertisement

Fire Accident: జేసీ దివాకర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. అనంతపురం నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన రెండు బస్సులు దగ్ధమయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున అనంతంపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై 11 KV వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. దీంతో చుట్టు పక్కల దట్టమైన పొగలు వ్యాపించాయి.

పరిసర ప్రాంతాల్లో భారీగా పొగలు వ్యాపించడంతో స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు. అదృష్టవశాత్తూ బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్‌ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.  అసలు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేదా.. ఎవరైనా కావాలనే చేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: Social Media Executive Posts: మంత్రుల కార్యాలయాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.50,000 జీతం.. మంచి అవకాశం..!

అయితే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉండడంతో.. ప్రత్యర్థులు ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడక పోవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ బస్సులు 5 సంవత్సరాల నుంచి వాడకంలో లేకపోవడంతో జేసి దివాకర్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదని తెలుస్తోంది.  పోలీసులు విచారణ జరిపిన అనంతంర ప్రమాదానికి సంబంధించి నిజానిజాలు తెలియనున్నాయి.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×