E-Paper
Advertisement

Pawan Mediates BJP and TVK: తమిళనాట ‘పవర్’ పాలిటిక్స్.. విజయ్‌ తో పవన్ కళ్యాణ్ మంతనాలు, ఏం ప్లాన్ భయ్యా!

Pawan Mediates BJP and TVK: తమిళనాట ‘పవర్’ పాలిటిక్స్.. విజయ్‌ తో పవన్ కళ్యాణ్ మంతనాలు, ఏం ప్లాన్ భయ్యా!
Advertisement

Pawan Mediates BJP and TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్చి 30న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 6 చివరి తేదీ కాగా.. ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే (DMK), ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలో బలమైన శక్తిగా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే (AIADMK) ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో బరిలో ఉంది. జాతీయ పార్టీలైన బీజేపీ (BJP) అన్నామలై నాయకత్వంలో తన ఉనికిని చాటుకోవాలని చూస్తుండగా, కాంగ్రెస్ డీఎంకేతో కలిసి నడుస్తోంది. వీటితో పాటు అగ్ర నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) రాబోయే ఎన్నికల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది.

విజయ్‌ నేతృత్వంలోని TVK పార్టీని NDAలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ కీలక రాయబారానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తుండటం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అగ్ర నటులుగా, రాజకీయ నేతలుగా ఇద్దరికీ ఉన్న ఇమేజ్‌ను ఉపయోగించుకుని, తమిళనాట పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

Advertisement

తాజా సమాచారం ప్రకారం, టీవీకే పార్టీతో పొత్తు కోసం బీజేపీ భారీ ఆఫర్లను విజయ్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. కూటమిలో భాగంగా టీవీకేకు సుమారు 80 అసెంబ్లీ స్థానాలను కేటాయించేందుకు బీజేపీ సిద్ధమైందని సమాచారం. అంతేకాకుండా, ఎన్నికల అనంతరం విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆఫర్ చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, విజయ్ మాత్రం ముఖ్యమంత్రి పదవిపైనే గురి పెట్టినట్లు సమాచారం.

బీజేపీ వ్యూహం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే విజయ్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడి అవసరం బీజేపీకు ఉంది. అయితే, విజయ్ తన మొదటి రాజకీయ సభలోనే బీజేపీను సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేను రాజకీయ ప్రత్యర్థిగా అభివర్ణించారు. ఈ సైద్ధాంతిక దూరం వల్ల పొత్తు కుదిరితే సొంత ఓటు బ్యాంకుకు ఏవైనా నష్టం జరుగుతుందా అనే కోణంలో విజయ్ ఆలోచిస్తున్నారు. మరోవైపు, అంతర్గత సర్వే నివేదికలు ఎన్డీఏకు అంత అనుకూలంగా లేకపోవడంతో, విజయ్‌ను ఎలాగైనా ఒప్పించాలని బీజేపీ పట్టుదలతో ఉంది.

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీలతో కలిసి విజయం సాధించిన పవన్ కళ్యాణ్ అనుభవాన్ని ఇక్కడ వినియోగించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. విజయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ భారీ అభిమాన గణం ఉండటం, వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం చర్చలకు కలిసొచ్చే అంశాలు. ఇప్పటి వరకు ఇరు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తెరవెనుక చర్చలు తుది దశకు చేరుకున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన బీజేపీతో పొత్తు ఉండదని, 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సైతం వీటిని పుకార్లుగా కొట్టిపారేసినప్పటికీ.. తెరవెనుక చర్చలు మాత్రం నిరంతరం సాగుతున్నాయని సమాచారం.

Read Also: Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×