E-Paper
Advertisement

సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ కీలక లేఖ.. ఆ విషయంలో అస్సలు తగ్గవద్దంటూ డిమాండ్!

సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ కీలక లేఖ.. ఆ విషయంలో అస్సలు తగ్గవద్దంటూ డిమాండ్!
Advertisement

Pawan Kalyan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక కీలకమైన లేఖ రాశారు. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం, వారి భద్రతను కాపాడటం మనందరి ప్రాథమిక బాధ్యత అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాలల లైంగిక వేధింపుల ఉదంతాల నేపథ్యంలో, చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ బలంగా ఆకాంక్షించారు.

విచారణలో వేగం.. నిర్ధిష్ట కాలపరిమితి

Advertisement

చిన్నారులపై జరిగే దాడులకు సంబంధించిన కేసుల్లో న్యాయం జరగడంలో ఆలస్యం కాకూడదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పోక్సో (POCSO) కేసులకు పోలీసులు, న్యాయవ్యవస్థ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ తరహా కేసుల విచారణ కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఒక నిర్ధిష్ట కాలపరిమితిలోగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. అప్పుడే నేరస్థుల్లో భయం పుడుతుందని, బాధితులకు సత్వర న్యాయం అందుతుందని లేఖలో పేర్కొన్నారు.

Also Read: తెలంగాణ ఓటర్ల నమోదు గడువు పొడిగింపు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!

Advertisement

తక్షణ కేసు నమోదు..

సాధారణంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రాథమిక విచారణ పేరుతో సమయం వృధా అవుతుంటుంది. అయితే, పోక్సో ఘటనల్లో ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే, ఫిర్యాదు అందిన వెంటనే తక్షణమే కేసు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 39 ప్రకారం చిన్నారులకు ఉన్న జీవించే హక్కును, వారి బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

నిందితులకు నో బెయిల్

ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడే నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ కోరారు. కోర్టుల్లో నిందితులకు బెయిల్ రాకుండా ప్రభుత్వ యంత్రాంగం గట్టిగా వ్యతిరేకించాలని, వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేశారు. అదే సమయంలో, భయానక పరిస్థితులను ఎదుర్కొన్న బాధితులకు సమాజంలో పటిష్టమైన రక్షణ కల్పించడంతో పాటు, వారికి మానసిక ధైర్యాన్ని అందించడం ఎంతో ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

Also Read:ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×