E-Paper
Advertisement

షూటింగ్ పూర్తవ్వకుండానే 110 కోట్లా? దిల్ రాజు గారి ‘దిల్’ చాలా పెద్దదే!

షూటింగ్ పూర్తవ్వకుండానే 110 కోట్లా? దిల్ రాజు గారి ‘దిల్’ చాలా పెద్దదే!
Advertisement

The Paradise:నాని ..పక్కింటి కుర్రాడిగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన మన నవీన్ బాబు ఒక్కసారిగా రూటు మార్చాడు .ఈసారి క్లాస్ కాదు నేను ఊర మాస్ అంటూ దసరా సినిమాతో ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టాడు కూడా.ఇక ఆ తర్వాత వచ్చిన హిట్ 3  సినిమా కూడా వెండి తెరపై బ్లడ్ బాత్ ని పారించింది.అలా మాస్ కి కేరాఫ్ గా నిలిచిపోతున్న నాని ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ ఓదెలతో పారడైజ్ అంటూ మరో సినిమాని పట్టాలెక్కించాడు.

దిల్ రాజు గారు ఏకంగా 110 కోట్లు ఆఫర్

Advertisement

అయితే ఈ సినిమా చుట్టూ జరుగుతున్న బిజినెస్ ఇప్పుడు ఫిలిమ్ సర్కిల్స్ లో హాట్ న్యూస్ గా మారిపోయింది. కారణం.. ఈ సినిమాకి థియేట్రికల్  రైట్స్ కోసం దిల్ రాజు గారు ఏకంగా 110 కోట్లు ఆఫర్ చేశారట.అవును.. 110 కోట్లు ఇచ్చేస్తా వరల్డ్ వైడ్ గా  ఆ థియేట్రికల్ రైట్స్  నాకు ఇచ్చేయండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడట దిల్ రాజు .ఇలా ఒక్కసారిగా ఈ నైజాం బాబు గారు ఇలా ఏకంగా 110 కోట్లు ఆఫర్ చేశారని వార్త సర్కులేట్ అవ్వడంతో షాక్ అవుతున్నారట ట్రేడ్ పండిట్స్.

also read :ఒకప్పుడు ఛాన్సుల కోసం.. ఇప్పుడు డేట్ల కోసం! కిరణ్ అబ్బవరం రేంజ్ మామూలుగా లేదుగా!

Advertisement

ప్లాఫ్ అయితే రాజుగారి పరిస్థితి ఏంటో 

సినిమా హిట్ అయితే ఓకే. ఒకవేళసినిమా  ప్లాఫ్ అయితే రాజుగారి పరిస్థితి ఏంటి అని గుసగుసలాడుకుంటున్నారట.అయితే ఇక్కడ చూస్తే దిల్ రాజు గారి లెక్కే వేరు.శ్రీకాంత్ నాని కాంబోలో వచ్చిన దసరా ఈజీగా 100 కోట్లు కొట్టేసింది.ఇక ఇప్పుడు వస్తున్న పారడైజ్ పై అంతకుమించి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో కలెక్షన్  కింగ్  మోహన్ బాబు,బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు,కయాదు లోహర్ వంటి తారలు ఉండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి .సో ఈ లెక్కన ఎటు చూసినా ఈ సినిమా ప్రాఫిట్ వెంచర్ అని ఫిక్స్ అయిపోయాడు దిల్ రాజు .అందుకేనేమో ఏకంగా  110 కోట్ల ఆఫర్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

నిజమైతే నాని కెరియర్ లోనే అది ల్యాండ్ మార్క్

అయితే ఈ 110 కోట్ల డీల్  వార్తలపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి బహుశా రేట్లు ఇంకా పెంచడానికి ఇలాంటి లీకులు ఇస్తున్నారా లేక నిజంగానే ఇంత సాహసం చేస్తున్నారో అన్నది కొద్దిరోజులు ఆగితే గాని తెలియదు.ఒకవేళ ఈ డీల్ నిజమైతే నాని కెరియర్ లోనే అది ల్యాండ్ మార్క్ గా నిలవడం పక్కా.ఒకవేళ అబద్ధమైతే ఎప్పట్లాగే సోషల్ మీడియా గాసిప్ అంటూ సరి పెట్టుకోవడమే!

also read :పోసాని భార్యను రోజూ బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఆ రోజూల్లో ‘గురూజీ’ పడ్డ కష్టాలు ఇవే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×